
Relationship Tips: ప్రస్తుతకాలంలో బంధాలు బలహీనంగా మారుతున్నాయి. ప్రియురాలు-ప్రియుడు లేదా భర్త-భార్య కావచ్చు.. చిటికీమాటికీ గొడవ పడటం.. మనస్పర్థలతో దూరమవడం.. కామాన్ గా మారుతోంది. రిలేషన్‌షిప్ లో ప్రేమ, బాధ్యత, అర్ధం చేసుకోవడం, నమ్మకం అనేది ముఖ్యం.. దీనికి ఇరువైపుల నుంచి ఒప్పందం ఉండాలి.. ముఖ్యంగా మహిళలు.. మగవారిలో కొన్ని లక్షణాలను గమనిస్తారు.

స్త్రీలు తమ భాగస్వామిలో ఎదుటివారి ఆలోచనా విధానం, అతని స్వభావం, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు...? ఇలా మొదలైన కొన్ని విషయాలను గమనిస్తారు. ఈ సంబంధాలతో మీ సంబంధం బలపడుతుంది లేదా బలహీనంగా మారవచ్చు. కావున భర్తలో భార్య గమనించే ఆ లక్షణాలేంటో చూడండి..

మానసికంగా కనెక్ట్ అవ్వకపోవడం: మహిళలు తరచుగా తమ భాగస్వామి తమ మాట వినాలని, మానసికంగా వారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటారు. ఇలాంటి సమయాల్లో పురుషులు ఈ విషయాలను విస్మరిస్తే మహిళలు నిరాశ చెందుతారు.

బాధ్యతను సీరియస్‌గా తీసుకోకపోవడం: మహిళలు తరచుగా తమ కుటుంబం, ఇంటి బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వారి భాగస్వామికి సహాయంగా ఉండకపోయినా.. వారు చెప్పింది బాధ్యతగా తీసుకోకపోయినా.. అలాంటి వారిని మహిళలు ఇష్టపడరు.

అక్రమ సంబంధం: ఏదైనా సంబంధం ప్రేమ మీద నడుస్తుంది.. తప్ప విషపూరిత బంధం మీద కాదు. ఎల్లప్పుడూ ఓపెన్‌గా ఉండే వారిని మహిళలు ఇష్టపడతారు. అలా కాకుండా ఏదైనా అక్రమ సంబంధం.. ఎవరితోనైనా మంచిగా ప్రవర్తించడం లాంటివి వారికి నచ్చదు..

ప్రతిదానిని నిందించడం: చాలా సందర్భాలలో పురుషులు ప్రతి నిర్ణయంపై స్త్రీలను నిందించడం.. లేదా వారితో అమర్యాదగా వ్యవహరించడం కనిపిస్తుంది. అలాంటి వారిని మహిళలు ఇష్టపడరు. మహిళలు తమ అనుభవాలు, అభిప్రాయాలను విస్మరించే వారిని దగ్గరికి రానివ్వరు..