Relationship Tips: మహిళలకు అలర్ట్.. భర్తతో గొడవ పడే అలవాటుందా..? పొరపాటున కూడా ఇలా చేయకండి..

|

May 22, 2024 | 7:46 PM

పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు రావడం సహజం.. అయితే ఈ గొడవలను మరింత ముందుకు తీసుకెళ్లకూడదు.. అప్పుడే ఆ సంబంధం జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంది. సాధారణంగా కొన్ని విషయాలను మాట్లాడేటప్పుడు.. ఎప్పటికీ గొడవకు దారితీయకుండా ప్రయత్నాలు చేయాలి.. కానీ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా..

1 / 5
పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు రావడం సహజం.. అయితే ఈ గొడవలను మరింత ముందుకు తీసుకెళ్లకూడదు.. అప్పుడే ఆ సంబంధం జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంది. సాధారణంగా కొన్ని విషయాలను మాట్లాడేటప్పుడు.. ఎప్పటికీ గొడవకు దారితీయకుండా ప్రయత్నాలు చేయాలి.. కానీ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా, ఒక వాదన తలెత్తితే, విషయం మరింత దిగజారుతుందని ఆలూమగలు ఇద్దరూ అర్థం చేసుకోవాలి.. అయితే.. కొన్ని విషయాల్లో మాత్రం భార్య తన భర్తతో కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి.. ముఖ్యంగా గొడవల సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి.. గొడవల తర్వాత భార్య తన భర్తతో ఎలాంటి విషయాల గురించి చర్చించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
పాత తప్పులను గుర్తు చేయవద్దు: భార్య తన భర్తతో గొడవపడినప్పుడల్లా, ఆమె అతని గత తప్పులను అతనికి గుర్తు చేయకూడదు. ఎందుకంటే గతాన్ని తవ్వడం వల్ల సమస్య పరిష్కారానికి బదులు.. మరింత పెద్దదిగా మారింది.. గొడవ తీవ్రమవుతుంది. మీ లక్ష్యం పోరాటాన్ని ముగించడం.. అగ్నికి మరింత ఆజ్యం పోయడం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి.

3 / 5
వివాదాలను పరిష్కరించడంలో తొందరపడకండి: కొన్నిసార్లు మీరు గొడవ గురించి చాలా తీవ్రంగా ఉంటారు.. అటువంటి పరిస్థితిలో, వెంటనే నష్టాన్ని నియంత్రించడానికి ప్రయత్నించవద్దు.. ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. వాతావరణం చల్లబడే అవకాశం కల్పించడం మంచిది. కోపంతో ఉన్న మీ భర్తను ఒప్పించే ప్రయత్నం చేస్తే, అతని కోపం మరింత పెరిగే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు సమయం ప్రతి గాయాన్ని నయం చేస్తుంది.. కాబట్టి అవగాహనతో ఈ వివాదం కూడా పరిష్కారమవుతుందని గ్రహించాలి..

4 / 5
సమస్యను పరిష్కరించినట్లు నటించవద్దు: మీరు మీ భర్తతో వివాదాన్ని పరిష్కరించుకోవాలనుకుంటే, మీ హృదయంతో ఈ పని చేయండి. మీరు ప్రతిదీ సరిదిద్దాలని కోరుకుంటున్నట్లు నటించవద్దు. నకిలీ భావోద్వేగాలను దాచడం ఏ వ్యక్తికైనా అంత సులభం కాదు. తప్పు మీది అయితే, క్షమాపణలు చెప్పడానికి వెనుకాడొద్దు.. సమస్యను త్వరగా పరిష్కరించడానికి మార్గాన్ని అన్వేషించండి..

5 / 5
భర్త బంధువులపై వ్యాఖ్యానించవద్దు: భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఒకరి బంధువులపై మరొకరు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చాలా తరచుగా జరుగుతుంది. భార్య దీన్ని అవలంభించకూడదు.. ఇదే కొనసాగితే.. భర్త మీ తల్లిదండ్రులను తిట్టడం.. మీరు వారి కుటుంబంపై పలు మాటలు అనడం కొనసాగుతూ ఉంటుంది.