అరటిపండు చాలా పోషకరమైన పండు .. అందుకే, దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే.. శరీరానికి ఎన్నో ప్రయోనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. మీరు అరటిపండును కొనడానికి చాలా డబ్బును ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అందుబాటు ధరల్లోనే రకరకాల అరటిపండ్లు సులువుగా దొరుకుతాయి.. ఒక పండిన అరటిపండులో 22 శాతం కార్బోహైడ్రేట్ ఉంటుంది.. ఇంకా డైటరీ ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్లు B6, C ఎక్కువగా ఉంటాయి. అయితే.. పచ్చి అరటిపండులోకి ఎన్నో పోషకాలు ఉన్నాయని వైద్య నిపునులు చెబుతున్నారు. అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యంతోపాటు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.