Winter Season: రాజస్థాన్‌లోని ఈ ప్రదేశాలు చలికాలంలో మరింత అందంగా మారుతాయి..
మనదేశంలో అతి పెద్ద రాష్ట్రం రాజస్థాన్. పర్యాటక ప్రదేశంగా చాలా ప్రసిద్ధి గాంచింది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు రాజస్థాన్ ను సందర్శిస్తారు. ఇక్కడ ఉన్న చారిత్రక భవంతులు, కోటలు, కళలు, సంస్కృతులు, కట్టడాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. అందుకనే మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులు ఎక్కువగా రాజస్థాన్ ను సందర్శిస్తారు. వాస్తవానికి రాజస్థాన్ వేడి ప్రాంతం అయినప్పటికీ.. శీతాకాలంలో అనేక ప్రదేశాల అందం పెరుగుతుంది. ఈ చలికాలంలో రాజస్థాన్‌లో ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చో ఇపుడు తెలుసుకుందాం..