కేరళ సముద్ర జలాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విన్యాసాలు..!Rahul Gandhi Enjoying In See

|

Feb 25, 2021 | 2:14 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నడూ చేయని ఓ 'సాహస' కార్యం చేశారు. రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే కాస్త తీరిక చేసుకుని దేశం యావత్తూ కళ్లప్పగించి చూసే పని లోకి దిగారు.

1 / 9
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నడూ చేయని ఓ ‘సాహస’ కార్యం చేశారు. రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే కాస్త తీరిక చేసుకుని దేశం యావత్తూ కళ్లప్పగించి చూసే పని లోకి దిగారు.

2 / 9
కేరళ పర్యటనలో ఉన్న ఆయన.. కొల్లం జిల్లాలోని తంగసెరి బీచ్ ను సందర్శించారు. ఆ సందర్భంగా మత్స్య కారులు తమ బోట్లలో సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడాన్ని చూసిన ఆయన.. తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. తను కూడా ఓ బోటునెక్కి సముద్రం లోకి దూకారు.

3 / 9
సుమారు 10 నిముషాలసేపు ఆయన ఈత కొడుతుంటే ..అప్పటివరకు ఆయనకు ఈత వస్తుందని తెలియనివాళ్లంతా తమ కళ్ళ ముందు జరుగుతున్నది చూసి నోళ్లు వెళ్ళబెట్టారు.

4 / 9
రాహుల్ మత్స్యకారులతో  సుమారు రెండున్నర గంటలు గడిపారు. వారు తయారు చేసిన ఫిష్ కర్రీని బోటులో వారితో కలిసి ఆరగించారు. కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ఆయన.. వీరి సమస్యలను తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తానని హామీ ఇచ్చ్చారు.

5 / 9
ఇప్పటికే కేరళ సహా నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకు ప్రచారాల కోసం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల వారిని ఆకట్టుకునేందుకు నానాపాట్లూ పడుతోంది.

6 / 9
రైతుల మాదిరే వీరు కూడా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అన్నదాతలు భూమిపై వ్యవసాయం చేస్తే మత్స్య కారులు సముద్రంలో ఈ ‘వ్యవసాయం’ చేస్తున్నారని ఆయన అన్నారు.

7 / 9
ఇప్పటివరకు రైతుల డిమాండ్లను తమ ఎన్నికల ‘ప్రచారాస్త్రం’గా వినియోగించుకోజూస్తున్న వందేళ్లకు పైగా చరిత్ర గల ఈ పార్టీ ఇప్పుడు మత్స్య కారుల సమస్యలపై దృష్టి పెట్టింది. ఇన్నాళ్లూ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్న సందర్భాల్లో ఈ వర్గం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటు వచ్చింది.

8 / 9
 రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే  రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే కాస్త తీరిక చేసుకుని దేశ పర్యటనలో  రాహుల్ గాంధీ ఎన్నడూ చేయని ఓ సాహసం చేశారు.

9 / 9
సముద్ర జలాలలో వారితో కలిసి ఈత కొట్టడం చూస్తే ఇది కూడా రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక ఈ ఎత్తుగడను బీజేపీ నేతలు ఎలా తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటారో చూడాల్సి ఉంది.