
హిందూ సంప్రదాయంలో ఎలాంటి శుభకార్యాలు జరిగినా.. ఖచ్చితంగా తమలపాకు ఉండాల్సిందే. తమల పాకు లేనిదే ఆ కార్యక్రమం పూర్తి కాదు. తమలపాకుకు అంత ప్రత్యేకమైన స్థానం ఉంది. తమల పాకు అనేది బుధ గ్రహానికి సంబంధించింది.

జాతకంలో బుధ గ్రహం బాగుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బుధుడు తెలివితేటలకు, ఆరోగ్య సిద్ధికి కారణం. అలాగే వృత్తి వ్యాపారాల్లో విజయం సాధించాలంటే బుధుడు అనుకూలించాలి.

జ్యోతిష్య ప్రకారం తమల పాకును తలగడ కింద పెట్టుకుని పడుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన అనేవి దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతే కాకుండా ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది.

నిద్ర సంబంధిత సమస్యలతో బాధ పడేవారు దిండు కింద తమలపాకు పెట్టుకుని నిద్రించడం మంచిది. అంతేకాకుండా శరీరంలోని, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.

వేసవిలో చాలా మందికి ముక్కు నుంచి రక్తం వస్తుంది. ఈ సమస్య నివారణకు తమలపాకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తమలపాకు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. తమలపాకు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. కాబట్టి మొటిమలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలను ఇట్టే నివారిస్తుంది.