
నిమ్మరసం, కొబ్బరి నూనె: 2-3 చెంచాల కొబ్బరి నూనెను వేడి చేసి, సమాన మొత్తంలో నిమ్మరసంతో కలపండి. దీన్ని మీ తలకు పట్టించి, 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు ఉంచండి. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. నిమ్మరసం చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె మీ జుట్టును తేమగా ఉంచుతుంది. దీంతో చుండ్రు సమస్య దూరం అవుతుంది.

అరటిపండు, తేనె, నిమ్మకాయ: అరటిపండు, తేనె, నిమ్మకాయ కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేయండి. దీన్ని మీ తలకు పట్టించి, 30 నిమిషాల తర్వాత కడిగేయండి. అరటిపండు చుండ్రును తగ్గిస్తుంది. అలాగే జుట్టును మృదువుగా చేస్తుంది. తద్వారా వెంట్రుకలు రాలడం కూడా తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

వేప: వేపాకులను మెత్తగా నూరి, పేస్ట్ లా చేసి తలకు పట్టించండి. 15-20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. వేపలో యాంటీ-ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. ఇలా కొన్నిరోజులు చేస్తే మీ జుట్టు చుండ్రు పూర్తిగా తగ్గి ఆరోగ్యంగా ఉంటుంది.

మెంతులు: మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయానికి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 30 నిమిషాల తర్వాత కడిగేయండి. మెంతులు చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి. దీంతో కుదుళ్ళ బలపడి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

మందార, వేప: మందార పువ్వుల ఆకులను మెత్తగా నూరి, వేప ఆకులతో కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ రెండు పదార్థాలు చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.