మామిడి ఆకులతో ఆరోగ్యానికి శ్రీరామ రక్షణ.. మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు పరార్..!

|

Sep 03, 2024 | 11:26 AM

మామిడి ఆకులలో బోలెడన్ని పోషకాలు ఉంటాయని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మామిడి చెట్ల ఆకులు పుష్కలమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయని అంటున్నారు. మామిడి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని సూచిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులతో కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
మామిడి ఆకులు కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేసి లావు తగ్గేలా చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తాయి. ఉబ్బరం, వాపు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

2 / 6
లేత మామిడి ఆకులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు లేత మామిడి ఆకులను నమిలి తిన్నా, లేదా మామిడి ఆకులను మరిగించి కషాయంలా తీసుకున్న మధుమేహం అదుపులో ఉంటుంది.

3 / 6
మామిడి ఆకులలో ఉండే మాంగిఫెరిన్ యాంటీ మైక్రో బయల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇక మామిడి ఆకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని రాత్రంతా ఉంచి ఉదయాన్నే దాన్ని వడకట్టుకుని ఖాళీ కడుపుతో తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

4 / 6
క్యాన్సర్ వంటి రోగాలకు, ఊబకాయం, గుండె జబ్బులు, జీర్ణ క్రియ, కొలెస్ట్రాల్ సమస్య పరిష్కారానికి మామిడి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. మామిడి ఆకులు రక్తనాళాలను బలపరిచి రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మామిడి ఆకుల టీ తయారుచేసుకుని తాగిన, మామిడాకులను మరిగించి ఆ నీటితో స్నానం చేసిన ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

5 / 6
ఇక మామిడి ఆకులలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. మామిడి ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి మరియు ఫ్లేవనాయిడ్లు , శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కడుపు పూత చికిత్సలలో కూడా మామిడి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి.

6 / 6
మామిడి ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టుకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. జుట్టు నెరిసిపోకుండా ఇవి కాపాడతాయి. ఇవి కొలాజిన్ ఉత్పత్తికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. మామిడి ఆకులతో టీ, ఆకులను మరిగిస్తే వచ్చే రసం, ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకుని కూడా వాడుకోవచ్చు.