
మొదటి రోజు రోజ్ డే.. ఈ రోజు అందమైన గులాబీని తన భాగస్వామికి ప్రేమను పంచుతారు. ఇంకొందరు తమ ప్రేమను గులాబీ పువ్వు ద్వారా వ్యక్తరుస్తారు. ఇక రెండో రోజు ప్రపోజ్ డే.. ( ఫిబ్రవరి8) నేడు ప్రపోజ్ డే. ఈ రోజు తనలోని ప్రేమను కవితల ద్వారా వ్యక్త పరుస్తుంటారు. కొందరు తనలోని భావాలను మాటల ద్వారా తన భాగస్వామికి తన పై ఉన్న ప్రేమ ఇది అంటూ తెలుపుతారు.

అయితే మీరు కూడా మీ ప్రియురాలికి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇలా చేసి చూడండి.. మీ లవర్ మీకు ఫిదా అయిపోయి మీ లవ్ యాక్సెప్ట్ చేయడం ఖాయం. ముందుగా తనపై మీకు ఉన్న ప్రేమను గుర్తు తెచ్చుకొని, ఓ అందమైన కవిత ద్వారా, ఆ ప్రేమను వ్యక్త పరచడానికి రెడీ అవ్వండి. ఇప్పుడు మనం ప్రేమను ఎలాంటి కవితల ద్వారా చెబితే బాగుంటుందో చూసేద్దాం.

నీ పరిచయం నాకు ఓ అద్భుతమైన జ్ఞాపకం.. ఎన్నో ఊసులు నీతో చెప్పాలని ఉంది, నిన్ను చూస్తే మౌనమే.. కానీ ఆ మౌనం కంటే నాకు నీ పై ఉన్న ప్రేమ గొప్పది.. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను.. హ్యాపీ ప్రపోజ్ డే .. మై డియర్.

మాటల కందని భావం నాది, వర్ణించలేనంత ప్రేమ నాది, నా గుండె చప్పుడు లయ నీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ, ఆ చప్పుడులో కూడా నీ పేరే ఉంటుంది. నువ్వు నా జీవితంలోకి అడుగు పెడితే.. నీకు ఏ కష్టం రాకుండా.. మహారాణిలా చూసుకుంటాను.

ప్రేమించడం ఎవరైనా ప్రేమిస్తారు.. కానీ ప్రేమను నిలబెట్టు కొని, తోడుగా నిలిచిన భాగస్వామిని ఆనందంగా చూసుకోవడమే నిజమైన ప్రేమ. నా ప్రతి సంతోషంలో నీ భాగం ఉండాలి.. నీకు ఎప్పుడూ అండగా నేను ఉండాలి. నువ్వు నా ప్రేమను అంగీకరిస్తావని నేను ఆశిస్తున్నాను. హ్యాపీ ప్రపోజ్ డే.