
చలి, వర్షాకాలంలో పాములు ఇంట్లోకి రాకడం సర్వసాధారణం. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మనం కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇందు కోసం మనం ఏం చేయాలంటే.. పాములను తరమికొట్టే వస్తువులను మన ఇంటి గుమ్మంలో ఉంచాలి.

కొన్ని మొక్కల వేర్లు పాములను తరిమికొట్టే ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. వీటి వాసనను పాములు అస్సటు ఇష్టపడవు. అలాంటి ఘాటైన వాసన గల వస్తువులను మనం ఇంటి గుమ్మం దగ్గర ఉంచడం వల్ల వాటిని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు.

పాములను చీదరపుట్టించే వాసన కలిగిన మొక్కల తెల్లగరిగే మొక్క కూడా ఒకటి. ఇది మీ ఇంటి పరిసరాల్లో ఉన్నా.. లేదా వీటి వేర్లను ఇంటి గుమ్మంలో ఉంచినా.. వాటి ఘటైన వాసకు పాములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

ఈ వేర్లతో పాటు దాల్చిన చెక్క కూడా పాములకు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఇంటి గుమ్మం, కిటికీ అద్దాలు లేదా ఇంటి ప్రాంగణంలో లవంగం, దాల్చిన చెక్క నూనెను పూయడం ద్వారా కూడా వాటిని ఇంట్లోకి రాకుండా ఆపవచ్చు.

ఇవే కాకుండా పాములకు తులసి వేర్ల వాసన కూడా అస్సలు నచ్చదు. ఈ తులసి మొక్క వేర్లను తీసుకొని ఇంటి గుమ్మంలో కట్టడం ద్వారా కూడా మీరు పాములను ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు. ( గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)