Pomegranate: గుండె సమస్యలకు దానిమ్మ రసం దివ్యౌషధం.. రోజుకి గ్లాసుడు తాగితే చాలు!

|

Apr 10, 2024 | 9:44 PM

ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండిన దానిమ్మ పండు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున్న శరీర కణాలను రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో, టైప్-2 మధుమేహం వంటి వ్యాధులను నివారించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా ప్రతిఘటించే సామర్థ్యం దానిమ్మపండులోని కొన్ని భాగాల్లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి..

1 / 5
రక్తహీనత సమస్య నివారణలో దానిమ్మ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కానీ ఈ సమస్య ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఈ పండును తినకూడదు. ముఖ్యంగా ఈ కింది ఆరోగ్య సమస్యలున్నవారు దానిమ్మ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది.

2 / 5
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా ప్రతిఘటించే సామర్థ్యం దానిమ్మపండులోని కొన్ని భాగాల్లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దానిమ్మపండులో పాలీఫెనోలిక్ అనే ప్రయోజనకరమైన సమ్మేళనం ఉంటుంది. ఈ పండు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దానిమ్మ రసం తాగితే ఛాతీ నొప్పి తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

3 / 5
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా దానిమ్మ రసం నివారిస్తుంది. అందుకే ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగితే కిడ్నీలు బాగుంటాయని నిపుణులు సూచిస్తుంటారు. దానిమ్మ రసం నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడం ద్వారా దంత క్షయాన్ని నివారిస్తుంది.

4 / 5
క్రమం తప్పకుండా దానిమ్మ రసాన్ని తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దానితో పాటు ప్రేగులలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా సంఖ్య కూడా పెరుగుతుంది. ఫలితంగా గ్యాస్-గుండె మంట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 / 5
దానిమ్మలో ఉండే ఎల్లాగిటానిన్ అనే యాంటీఆక్సిడెంట్ అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులను నివారించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.