
రేపు రక్షా బంధన్ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని సీఎం జగన్ కు ముందుగానే రాఖీ కట్టారు.

సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన రజని తాను సోదరుడిగా భావించే జగన్ కు రాఖీ కట్టి మురిసిపోయారు.

ఈ సందర్భంగా ఆయన విడదల రజనిని ఆశీర్వదించారు. కాగా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కూడా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు.

సీఎం జగన్ ఇవాళ విజయవాడలో ఐఏఎస్ అధికారులు కె.ప్రవీణ్ కుమార్, సునీత దంపతుల కుమారుడు పృథ్వి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎం జగన్ నూతన వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.