
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ అందించింది. ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కోల్హాపూర్‌తో పాటు గోవా, మేడారం, శ్రీశైలం, అరుణాచలం, కంచి, కాళేశ్వరం ప్రదేశాలను చూడాలనుకునేవారికి మంచి అవకాశం కల్పిస్తోంది.

ఈ నెల 23వ తేదీ నుంచి కోల్హాపూర్, పండరీపూర్, గానుగాపూర్, తుల్జాపూర్ ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో బీహెచ్ఈఎల్ నుంచి ఈ బస్సులు స్టార్ట్ కానున్నాయి. ఇందులో ఛార్జీలు రూ.3 వేలుగా నిర్ణయించారు. మూడు రోజుల పాటు ఈ టూర్ ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

పైన పేర్కొన్న ప్యాకేజీలో పాల్గొనదల్చుకున్నవారు 9391072283, 9063401072 నెంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇక ఫిబ్రవరి 6వ తేదీన గోవా టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ గోవా యాత్ర ఐదు రోజుల పాటు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.3,500గా ఉంటుంది. గోవాతో పాటు హంపి, తుల్జాపూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు.

గోవా టూర్ ప్యాకేజీలో పాల్గొనదల్చుకునేవారు 391072283, 9063401072 నెంబర్లను సంప్రదించాలి. ఇక టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా బస్సు రిజర్వేషన్ కౌంటర్లలో సంప్రదించి ముందుగానే వీటికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు ఆర్టీసీ టికెట్ కౌంటర్లను సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.

ఈ నెలలో మేడారం మహా జాతర ప్రారంభం కానుంది. దీంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను భారీగా ప్రవేశపెట్టింది. కొంతమంది ముందుగానే సమ్మక్క సారలమ్మకు మెక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి స్పెషల్ బస్సులను తీసుకొచ్చింది. వీటి ఛార్జీల వివరాలను కూడా ఇప్పటికే వెల్లడించింది.