Jana Sena Jana Vani: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సామాన్యుడి గళం వినిపించేలా జనవాణి - జనసేన భరోసా కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ప్రారంభించారు. జనసేన జనవాణి కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. జనవాణి - జనసేన భరోసా కార్యక్రమం ద్వారా తమ సమస్యలను జనసేనాని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళుతున్నారు.