Bharat Jodo Yatra: రాహుల్ గాంధీని కాపీ కొడదామనుకున్న జమ్మూకశ్మీర్ మాజీ సీఎం.. కానీ చివరకు ఏమయ్యిందంటే..

|

Jan 27, 2023 | 6:02 PM

భారత్ జోడో యాత్ర: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఎముకలు కొరికే చలిలో సాగుతున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’కు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మద్దుతునిచ్చారు. రాహుల్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్న ఒమర్ రాహుల్ లాంటి టీ షర్ట్ ధరించాడు. అయితే కొద్దిసేపటికి చలి అనిపించడంతో వెంటనే జాకెట్ వేసుకున్నాడు.

1 / 5
 భారత్ జోడో యాత్ర: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రారంభమైన ‘భారత్ జోడో యాత్ర’ చివరి దశకు చేరుకుంది. శుక్రవారం నాటికి జమ్మూకశ్మీర్‌లోని  శ్రీనగర్‌లో ఎముకలు కొరికే చలిలో సాగుతున్న ఈ యాత్రలోనూ రాహుల్ టీషర్ట్‌తోనే నడుస్తున్నారు.

2 / 5
ఈ క్రమంలోనే నేషనల్ కాన్ఫరెన్స్‌ నాయకుడు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా రాంబన్ జిల్లాలోని బనిహాల్ నుంచి భారత్ జోడో యాత్రలో పాల్గొని రాహుల్‌కు మద్దతు తెలిపారు. యాత్రలో పాల్గొనే సమయానికి రాహుల్ ధరించిన టీ షర్ట్ మాదిరిగా ఉన్న షర్ట్‌నే ధరించాడు ఒమర్.

3 / 5
 దేశ ప్రతిష్ట గురించి ఆందోళన చెందుతూ రాహుల్ యాత్రలో చేరినట్లు ఒమర్ తెలిపారు. అయితే అలా కొద్ది దూరం నడిచిన తర్వాత తనకు చలి అనిపించడంతో ఒమర్ వెంటనే హాఫ్ జాకెట్ ధరించారు.

4 / 5
 కాంగ్రెస్ పార్టీ వర్గాల ప్రకారం ఒమర్ అబ్దుల్లా రాంబన్ జిల్లాలోని బనిహాల్ రైల్వేస్టేషన్ నుంచి దాదాపు 2 కి.మీ దూరం రాహుల్‌తో కలిసి పాదయాత్రలో నడిచాడు.

5 / 5
ఇక కాంగ్రెస్‌కు పూర్వవైభవం, పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో  రాహుల్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ జనవరి 30న శ్రీనగర్‌లో ముగుస్తుంది.