
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఏపీ నుంచి హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో విద్య, ఉపాధి కోసం ప్రజలు వస్తూ ఉంటారు. ఇక హైదరాబాద్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రూట్లల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సరిహద్దులను కలిపే రోడ్లను విస్తరించడంపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గుంటూరు-హైదరాబాద్ రూట్లో మరో కొత్త హైవేను నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతోండగా.. 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు.

పేరేచర్ల నుంచి కొండమోరు వరకు హైవే నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు 49.91 కిలోమీటర్లు ఉండనుంది. ఇందుకోసం రూ.881.61 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం ప్రభుత్వం పెట్టుకుంది. ఇది పూర్తైతే అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి 40 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీంతో మరింత వేగంగా హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.

ఈ నేషనల్ హైవేకు 167జీ అనే నెంబర్ కేటాయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సత్తెనపల్లి, కొండమోరు దగ్గర బైపాస్‌లు నిర్మించనున్నారు. అలాగే 11 చిన్న బ్రిడ్జిలు ఉంటాయి. అలాగే నాలుగు చోటల్ అండర్ పాస్‌లు ఉంటాయి. టోల్ ప్లాజా 1, ఆర్వోబీ 1 ఉంటుంది.

ఇంజినీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్‌స్ట్రక్షన్ విధానంలో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. పేరేచర్ల-కొండమోరు మార్గంలో వాహనాల సంఖ్యకు తగ్గట్లు రోడ్ల విస్తరణ జరగలేదు. దీంతో తరచూ ప్రమాదాలు ఎక్కువగా చేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని గమనించి రోడ్లు విస్తరించేందుకు ముందుకొచ్చాయి. దీని వల్ల ప్రజలతో పాటు పత్తి, మిర్చి, క్యారీలు, కంకర రావాణకు ఉపయోగం జరగనుంది.