
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 413 మందికిపైగా మృతి చెందగా.. మరో 200 మంది ఆచూకీ గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన నరేంద్ర మోడీ శనివారం వయనాడ్‌లో పర్యటించారు.

సహాయ, పునరావాస చర్యలను సమీక్షించేందుకు మోడీ హెలికాప్టర్‌లో కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు ప్రధాని మోడీ.

వయనాడ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని పరిశీలించారు.

ఏరియల్ సర్వేలో ఇరువజింజి పూజ (నది) ముండక్కై, చూరల్‌మల ప్రాంతాలను కూడా మోడీ పరిశీలించారు.