హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ టెక్నాలజీ రంగానికే కాదు, ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు కూడా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. సెప్టెంబర్‌లో మీరు హైదరాబాద్‌ని సందర్శించవచ్చు. హైదరాబాద్‌లో బిర్లా టెంపుల్, కుతుబ్ షాహీ సమాధులు, గోల్కోండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, నెహ్రూ జూలాజికల్ పార్క్ సహా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అలాగే పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఎన్నో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి.
జైపూర్, రాజస్థాన్: పింక్ సిటీగా పేరోందిన రాజస్థాన్ రాజధాని జైపూర్ సెప్టెంబర్ నెలలో సందర్శించడానికి చాలా ఉత్తమమైన ప్రదేశం. పింక్ సిటీలో లభించే ఆహారం అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీరు జైపూర్ వెళ్లినట్లయితే అమెర్ ఫోర్ట్, జైగర్ కోట, జల్ మహల్, హవా మహల్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, సిటీ ప్యాలెస్ వంటి ప్రదేశాలను తప్పక సందర్శంచండి.
మౌంట్ అబూ, రాజస్థాన్: రాజస్థాన్‌లోని మౌంట్ అబూ అందాలు సెప్టెంబర్‌లో మరింతగా పెరుగుతాయి. ఇక్కడ సూర్యాస్తమయం సమయంలో గడిపే క్షణాలు మరిచిపోలేనివిగా ఉంటాయి. ఇంకా మీరు మౌంట్ అబూలో ట్రెక్కింగ్, క్యాంపింగ్ కాకుండా లవర్ పాయింట్, దెల్వాడ జైన్ టెంపుల్, అర్బుదా దేవి టెంపుల్ వంటివాటిని కూడా సందర్శించవచ్చు.
బృందావన్, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది శ్రీ కృష్ణుని నివాసమైన బృందావనం. ఆధ్యాత్మిక క్షేత్రాలే కాక బృందావన్‌లో అనేక ఇతర అందమైన ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.
కునో నేషనల్ పార్క్: మధ్యప్రదేశ్‌లో అనేక జాతీయ పార్కులు ఉన్నాయి. వీటిలో అతి పెద్దది కునో నేషనల్ పార్క్, ఇది ఇక్కడ ఉండే చిరుతల కారణంగా ఎంతో ప్రసిద్ధి. ఈ పార్క్ అందాలను చూస్తే మంత్రముగ్ధులు కాకుండా ఉండలేరు.