
చాలా మంది వేసవి సెలవుల్లో ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ సందర్భంగా, మీరు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ను సందర్శించవచ్చు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం మీ మనసును ఆకట్టుకుంటుంది. అందుకే ఈ ప్రదేశం చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇంకా మీరు మేఘాలయ సంస్కృతి, వారసత్వం గురించి తెలుసుకోవచ్చు.

Umiam Lake: షిల్లాంగ్‌లోని అత్యంత అందమైన సరస్సులలో ఉమియం సరస్సు కూడా ఒకటి. చుట్టూ అడవులు, కొండలతో ఉన్న సరస్సు.. లమ్ నెహ్రూ పార్క్ సమీపంలో ఉంది. ఇది పిక్నిక్ కోసం చాలా మంచి ప్రదేశమని చెప్పుకోవాలి. ఈ సరస్సులో మీరు కయాకింగ్, బోటింగ్, స్కూటింగ్ వంటివి కూడా చేసి ఆనందించవచ్చు.

Elephant Falls: షిల్లాంగ్‌లోని ఈ జలపాతం అందం మీ మనసును ఆకట్టుకుంటుంది. దీని చుట్టూ మీరు పచ్చని దృశ్యాలను కూడా మీరు ఆరాధించగలరు. చాలా మంది పర్యాటకులను ఆకర్షించే ఈ ప్రదేశం ఒక మంచి రోమాంటిక్ ప్లేస్ అని చెప్పుకోవాలి.

Laitlum Canyon: మీరు సాహసాలు చేసేందుకు ఇష్టపడేవారైతే, మీరు Laitlum Canyonని ఎంతగానో ఇష్టపడతారు. ఈ ప్రదేశం ట్రెక్కింగ్, హైకర్లకు ఉత్తమమైనది, ప్రసిద్ధి. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు ట్రెక్కింగ్‌ను కూడా ఆస్వాదించవచ్చు. హిల్‌టాప్ నుంచి మీరు కొండ రోడ్లు, లోయలు, పరిసరాల అందాలను ఆస్వాదించగలరు. మీ భాగస్వామితో కలిసి వెళ్లేందుకు అత్యంత ఉత్తమమైన ప్రదేశం ఇది.

Lady Hydari Park: మీరు షిల్లాంగ్ వెళ్లినప్పుడు లేడీ హైదరీ పార్క్ కూడా సందర్శించవచ్చు. ఇక్కడ విరిసిన పూల అందాలు మీకు ఎంతగానో నచ్చుతాయి. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. మినీ జూ. మీతో పాటు పిల్లలు కూడా ఈ ట్రిప్‌కి వెళుతుంటే, వారికి ఈ ప్రదేశం చాలా నచ్చుతుంది.