Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranipur Police Station: 100ఏళ్ల పోలీసుల రికార్డులతో చరిత్ర వారసత్వం తెలియజేసే.. మ్యూజియం ఏర్పాటు..

Ranipur Police Station: మధ్యప్రదేశ్‌లోని బేతుల్ ఎస్పీ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. ఇందుకోసం మ్యూజియం నిర్మించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఉపయోగించిన ఆయుధాలను కూడా ఈ మ్యూజియంలో ఉంచారు.

Surya Kala

|

Updated on: May 16, 2022 | 10:47 AM

మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లోని రాణిపూర్‌లో రాష్ట్ర తొలి పోలీసు మ్యూజియం ఆదివారం ప్రారంభమైంది. రాణిపూర్ పోలీస్ స్టేషన్ పాతది. ఇప్పుడు మ్యూజియంగా మార్చబడింది.

1 / 9
పోలీస్ మ్యూజియంలో డీజీ నుంచి కానిస్టేబుల్ వరకు యూనిఫారం ధరించిన విగ్రహాలు పోలీస్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అంతే కాదు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉపయోగించే పరికరాలు, వాడే ఆయుధాలు భద్రపరిచారు.

2 / 9
ఆయుధాలు, పాత్రలు, టెలిఫోన్లు, టైప్ రైటర్లు, లాంతర్లు, మహాత్మాగాంధీ బేతుల్ రాకకు సంబంధించిన చిత్రాలు స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు, వారు ఉపయోగించిన వస్తువులతో సహా మ్యూజియంలో ఉంచబడ్డాయి.

3 / 9
బ్రిటీష్ కాలం నాటి ఎఫ్‌ఐఆర్‌తోపాటు స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన నిజాలను ఈ మ్యూజియంలో భద్రపరిచారు. పోలీసులకు చెందిన ముఖ్యమైన పత్రాలు, పోలీసు శాఖకు సంబంధించిన వాస్తవాలు కూడా మ్యూజియంలో ఉన్నాయి.

4 / 9
పోలీసు శాఖలో అమరులైన పోలీసు అధికారులు, ఉద్యోగుల పరిచయంతో సహా చిత్రాలను కూడా మ్యూజియంలో ఉంచారు.

5 / 9
స్వాతంత్ర సమరయోధుడు, సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ బ్లాక్‌లో సభ్యుడిగా, స్వాతంత్య్ర పోరాటంలో వివిధ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన సర్దార్ విష్ణు సింగ్ గోండ్ చిత్రం కూడా మ్యూజియంలో ఉంది.

6 / 9
క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 ఆగస్టు 22న విష్ణుసింగ్ గోండ్, గాంధేయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్ రాణిపూర్ భవన్‌పై గొడ్డలితో దాడి చేశారు. గొడ్డలిని కూడా మ్యూజియంలో ఉంచారు.

7 / 9
యూనిఫారాలు కూడా మ్యూజియంలో ఉంచబడ్డాయి. ప్రజలు ఇంతకు ముందు ఎలాంటి యూనిఫాం ధరించారు అనే సమాచారాన్ని ఇందులో చూడవచ్చు.

8 / 9
100 ఏళ్ల పోలీసుల రికార్డులను కూడా భద్రపరిచారు. ఒక లైబ్రరీ కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఇందులో పోలీసులకు సంబంధించిన పత్రాలు వాటిలో కొన్ని బ్రిటిష్ కాలం నాటి పత్రాలు కూడా ఉన్నాయి.

9 / 9
Follow us