పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? అయితే ఒక లక్షకు ఎంత నష్టపోతున్నారో తెలుసుకోండి..

|

Apr 28, 2021 | 6:58 PM

PF Balance Withdrawal : మీకు చాలా డబ్బు అవసరం ఉంటే తప్పించి.. ఈపీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయకూడదు. దయచేసి ఈ డబ్బు 58 సంవత్సరాల వయస్సు వరకు జమ చేయండి అప్పుడు మీరు ఊహించని డబ్బులు మీ చేతికందుతాయి. ఎలాగో తెలుసుకోండి.

1 / 5
పీఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బు ఉద్యోగ విరమణ సమయంలో మీకు మద్దతుగా నిలుస్తుంది. ఏదేమైనా చాలా సార్లు ఉద్యోగులు అవసరమైన సమయంలో డబ్బులు విత్ డ్రా చేస్తారు. అయితే ఉద్యోగ విరమణకు ముందు డబ్బు ఉపసంహరించుకోవడం వల్ల మీరు 10 రెట్ల డబ్బును కోల్పోతారు. ఈ లెక్కలు ఒక్కసారి గమనించండి..

2 / 5
మీరు డబ్బు విత్ డ్రా చేయడం వల్ల మీ భవిష్యత్ నిధిని అది ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి మీరు లక్ష రూపాయలు జమ చేసి ఉంటే అప్పుడు మీకు దానిపై వడ్డీ కలిపి మొత్తం11.55 లక్షల రూపాయల వరకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
చాలా ముఖ్యమైన పని అయితే తప్పా డబ్బును ఉపసంహరించుకోవద్దు. ఈ డబ్బు 58 సంవత్సరాల వయస్సు వరకు జమ చేయండి ఆ సమయానికి ఇది చాలా ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం దీనికి 8.5 శాతం వడ్డీ లభిస్తోంది. అన్ని రకాల చిన్న పొదుపు పథకాలలో ఇది అత్యధిక వడ్డీ.

4 / 5
మీకు ఉద్యోగ విరమణ సమయం30 సంవత్సరాలు ఉంటే మీరు ఒకవేళ 50 వేల రూపాయలు ఉపసంహరించుకుంటే అప్పుడు 5 లక్షల 27 వేల రూపాయల నష్టం మీకు కలుగుతుంది. అదే సమయంలో లక్ష రూపాయలకు 11 లక్షల 55 వేల రూపాయలు, 2 లక్షల రూపాయలకు 23 లక్షల 11 వేల రూపాయలు, 3 లక్షల రూపాయలకు 34 లక్షల 67 వేల రూపాయల నష్టం కలుగుతుందని తెలుసుకోండి.

5 / 5
మీ ఉద్యోగ విరమణకు 20 సంవత్సరాలు ఉంటే మీరు 50 వేల రూపాయలు ఉపసంహరించుకుంటే మీరు 2 లక్షల 5 వేల రూపాయలను కోల్పోతారు. అదేవిధంగా లక్ష రూపాయలకు 5 లక్షల 11 వేల రూపాయలు, 2 లక్షల రూపాయలకు 10 లక్షల 22 వేల రూపాయలు, 3 లక్షల రూపాయలకు 15 లక్షల 33 వేల రూపాయల నష్టం కలుగుతుంది.