PCOD and PCOS Signs: అల్ట్రాసౌండ్‌ టెస్ట్‌ అవసరమేలేదు.. ఈ లక్షణాలు ఉంటే మీ గర్భాశయం ప్రమాదంలో ఉన్నట్లే!

|

Jul 02, 2024 | 8:51 PM

నేటి కాలంలో 15 లేదా 25 యేళ్ల వయస్సు యువతులు అధికంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. అనారోగ్య జీవనశైలి దీనికి ప్రధాన కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పీసీఓడీ అనేది అండాశయాలు అసాధారణంగా ఆండ్రోజెన్‌లను ఉత్పత్తి చేసే పరిస్థితి. ఇది అండాశయ తిత్తులు ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ స్థితిలోబరువు పెరగడం, సీరియడ్స్‌ సమస్యలు పెరుగుతాయి..

1 / 5
నేటి కాలంలో 15 లేదా 25 యేళ్ల వయస్సు యువతులు అధికంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. అనారోగ్య జీవనశైలి దీనికి ప్రధాన కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
పీసీఓడీ అనేది అండాశయాలు అసాధారణంగా ఆండ్రోజెన్‌లను ఉత్పత్తి చేసే పరిస్థితి. ఇది అండాశయ తిత్తులు ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ స్థితిలోబరువు పెరగడం, సీరియడ్స్‌ సమస్యలు పెరుగుతాయి.

3 / 5
చాలా సందర్భాలలో శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల PCOD వస్తుంది. ముఖంపై వెంట్రుకలు పెరుగుతాయి. మొటిమలు ఏర్పడతాయి. మూడ్ స్వింగ్స్ కూడా ఏర్పడతాయి. చాలా మంది మహిళలు తమకు అండాశయ తిత్తులు ఏర్పడుతున్నాయని ప్రాథమిక దశలోనే గుర్తించకపోవం వల్ల పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. పీసీఓడీని ప్రారంభ దశలో నిర్ధారించడం కష్టం. అయితే ఈ కింది లక్షణాలు కనిపిస్తే మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుసుకోవచ్చు. తద్వారా తొలినాళ్లలోనే చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు.

4 / 5
PCOD లేదా PCOSతో బాధపడుతున్న వారు బరువు పెరగడం సహజం. ఈ సమయంలో శరీరంలోని చక్కెర స్థాయిలు, కార్టిసాల్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. PCOS శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యతకు కూడా కారణమవుతుంది. దీని కారణంగా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీంతో తీపి ఆహారం పట్ల మనసు పరుగిడుతుంది.

5 / 5
PCOS తో బాధపడేవారి శరీరంలో కార్టిసాల్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది శరీరాన్ని కూడా బలహీనపరుస్తుంది. PCOS తో తీవ్రమైన జుట్టు నష్టం. షాంపూ, నూనె ఎన్ని వాడినా జుట్టు రాలడం ఆగదు. అంతేకాకుండా క్రమరహిత ఋతుస్రావం, పీరియడ్స్‌ సమయంలో దిగువ పొత్తికడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఈ లక్షణాలను బట్టి మీరు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.