బొప్పాయిలో కేలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు దరి చేరవు. బొప్పాయిలో ఫైబర్, కెరోటిన్, విటమిన్ సి, ఈ, ఎ అనేక ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణసమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు బొప్పాయి తినకూడదు.