
గర్భవతులు: కడుపుతో ఉన్నవారు.. ప్రారంభ నెలల్లో పచ్చి లేదా సంగం పండిన బొప్పాయిని అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో ఉండే లేటెక్స్,పపైన్ అనే ఎంజయమ్‌లు గర్భాశయ సంకోచాలను ప్రేరేపించి గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ప్రమాదాన్ని పెంచుతాయని సూచిస్తున్నారు. ఒక వేళ తింటే పండిన బొప్పాయి తినాలని.. అది కూడా వైద్యుల సలహాతోనే తినాలని సూచిస్తున్నారు.

కిడ్నీ స్టోన్స్: కిడ్నీలో రాళ్లు ఉన్న వ్యక్తులు కూడా ఈ పండుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండులో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. విటమిన్ C అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సలేట్‌గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆక్సలేట్ కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు బొప్పాయిని చాలా మితంగా తినడం లేదా తినకపోవడం మంచిది.

గుండె సమస్యలు ఉన్నారు: బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ గుండె పనితీరుపై స్వల్ప ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పండును ఎక్కువగా తినడం వల్ల గుండె లయ తప్పడం లేదా నెమ్మదిగా కొట్టుకునే సమస్య మరింత పెంచే అవకాశం ఉందని.. కాబట్టి ఈ సమస్యలతో బాధపడే వ్యక్తులు దీనిని దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

షుగర్, అలర్జీ: లేటెక్స్ అలర్జీ ఉన్నవారికి బొప్పాయి తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి వీరు ఈ పండుదు దూరంగా ఉండడం మంచిది. అలాగే బొప్పాయికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం ఉంది. ఇప్పటికే ఇన్సులిన్ లేదా షుగర్ మందులు వాడేవారు ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీరు తినే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు సుమారు 100–150 గ్రాముల పరిమితిలో మాత్రమే తీసుకోండి. అది కూడా బాగా పండిన బొప్పాయిని మాత్రమే తినండి. గర్భవతులు పచ్చి బొప్పాయికి దూరంగా ఉండాలి. ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుల సలహా తీసుకొని మాత్రమే బొప్పాయి తినండి. Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.