Anakapalli: ఆపదలో ఆ మూగజీవి..! రక్షించేందుకు ఏకమైన గ్రామం.. ప్రోక్లేయినర్ తీసుకొచ్చి…

| Edited By: Surya Kala

Oct 26, 2023 | 4:00 PM

పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో బావిలో ఓ ఎద్దు పడిపోయింది. ఆహారం వెతుక్కుంటూ వెళ్తూ ప్రమాదంలో చిక్కుకుంది. ఎప్పటినుంచి ఉందేమో గాని.. గ్రామస్తుల్లో ఒకరి కంట పడింది. దీంతో.. విషయాన్ని గ్రామస్తులకు చేరవేశారు. గ్రామస్తులంతా ఏకమయ్యారు. కానీ బావి చూస్తే చాలా లోతు. దానికి తోడు నీరు కూడా ఉంది.

1 / 6
మనిషి ఆపదలో ఉంటే.. తన శక్తి మేర బయటపడేందుకు ప్రయత్నిస్తాడు. తన వల్ల కాకపోతే ఇతరులకు సహాయం అడుగుతాడు.. తాను సహాయం అడిగే పరిస్థితిలో లేకపోయినప్పటికీ ఎవరికైనా తెలిస్తే వెంటనే వెళ్లి సహాయం చేస్తారో ఆ ఆపద నుంచి బయటపడేసేందుకు తీవ్రంగా శ్రమిస్తారు.

2 / 6
మరి ఏదైనా మూగజీవి ఆపదలో ఉంటే..?! అవి నోరు విప్పి చెప్పుకోలేవు. ఎవరికీ కనిపించని చోట అయితే పరిస్థితి మరీ దయనీయం. అక్కడే ఊపిరి వదలాల్సిందే..! కానీ అనకాపల్లి జిల్లాలో.. ఓ మూగ జీవిని రక్షించేందుకు గ్రామమంతా ఏకమైంది. పెద్ద సాహసమే చేసింది..! వివరాల్లోకి వెళితే..

3 / 6
పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో బావిలో ఓ ఎద్దు పడిపోయింది. ఆహారం వెతుక్కుంటూ వెళ్తూ ప్రమాదంలో చిక్కుకుంది. ఎప్పటినుంచి ఉందేమో గాని.. గ్రామస్తుల్లో ఒకరి కంట పడింది. దీంతో.. విషయాన్ని గ్రామస్తులకు చేరవేశారు. గ్రామస్తులంతా ఏకమయ్యారు.

4 / 6
కానీ బావి చూస్తే చాలా లోతు. దానికి తోడు నీరు కూడా ఉంది. లోపలకి దిగి పైకి తీయాలంటే సాధ్యం కాని పని. పోనీ ఎలాగోలా తాళ్లతో బయటకు తీసేందుకు ప్రయత్నిద్దామన్నా.. భారీ కాయంతో ఉన్న ఆ ఎద్దు బరువుకు ఎవరు సాహసించలేరు.

5 / 6
ఓ ఎద్దు బావిలో పడి ప్రాణాపాయం లో ఉందని.. తెలుసుకున్న జెసిబి డ్రైవర్ కీర్తి గిరి చలించి పోయాడు. ప్రోక్లైనర్ తో సహా ఘటనా స్థలికి చేరుకున్నాడు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక.. సాహసం చేసిన స్థానిక యువకులు బావిలో దిగారు. మునిగిపోతూ ప్రాణాలు కోల్పోయే స్థితిలోకి వెళ్లిన ఎద్దును.. అతి కష్టం మీద తాళ్లతో కట్టారు.

6 / 6
దాదాపు గంటన్నర పాటు శ్రమించి.. ప్రోక్లైనర్ సాయంతో.. సురక్షితంగా బయటకు తీశారు. సకాలంలో ప్రోక్లైనర్ ను తీసుకొచ్చి ఎద్దును రక్షించేందుకు సహకరించిన డ్రైవర్ ను గ్రామస్తులు అభినందించారు.