
జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు చాలా మంది ఉల్లిపాయల రసాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇది జుట్టుకే కాదు చర్మానికి కూడా మేలు చేస్తుంది. చర్మంపై ఏర్పడిన మచ్చలను తొలగించడంలో ఉల్లిపాయ ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఈ రోజుల్లో చాలా మంది ముఖంపై ఎర్రటి మచ్చల సమస్యతో బాధపడుతున్నారు. ఇది ముఖం అందాన్ని తగ్గిస్తుంది. చర్మంపై ఈ మచ్చలను తొలగించడం అంత సులభం కాదు. కానీ ఉల్లిపాయ ఆ పనిని సులభతరం చేస్తుంది. అయితే దీనికి ముందు, అసలు ఇలా ఎందుకు జరుగుతుందో మీరు తెలుసుకోవాలి? ముఖంపై ఎర్రటి మచ్చలు ఏర్పడటానికి అసలు కారణం చర్మంలో మెలనిన్ స్థాయి పెరుగుదల. శరీరంలో మెలనిన్ స్థాయిలు పెరిగడం వల్ల ఇలా జరుగుతుంది.

మచ్చలను తొలగించడానికి ఉల్లిపాయ రసాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ పిగ్మెంటేషన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.

మచ్చలను తొలగించడానికి ముందుగా.. 1 నుంచి 2 చెంచాల ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాలి. కాటన్ సహాయంతో ఉల్లిరసాన్ని చర్మంపై ఎర్రగా ఉన్న ప్రదేశంలో అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. సుమారు 10 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మచ్చల సమస్య నుంచి బయటపడవచ్చు.

మచ్చలను తొలగించడానికి ఉల్లిపాయ రసంతోపాటు తేనెను కూడా ఉపయోగించవచ్చు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంన్నాయి. ఇది ముఖంపై మచ్చలను సులువుగా తగ్గిస్తుంది. 1 టీస్పూన్ ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకుంటే సరి.