
చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు శుక్రవారం రోజున మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి, లక్ష్మీదేవికి మూడు వస్తువులు సమర్పించడం వలన ఇంటి ఆనందం, శ్రేయస్సు నెలకొనడమే కాకుండా, అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయంట. కాగా మనం అమ్మవారికి ఏవి సమర్పించాలో చూసేద్దాం.

శుక్రవారం, లక్ష్మీదేవి, కాళికా దేవి, శుక్రచార్యులకు అంకితం చేసిన రోజు. ఇది చాలా పవిత్రమైన రోజు. అందుకే శుక్ర వారం రోజున ఎవరైతే ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజిస్తారో, వారికి ఆర్థికంగా కలిసి వస్తుందని చెబుతుంటారు. అయితే ఆర్థిక సమస్యలతో బాధపడే వారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మూడు వస్తువులను సమర్పించాలంట. అవి ఏవో చూసేద్దాం.

లక్ష్మీ దేవికి చాలా ఇష్టమైన పువ్వు తామర పువ్వు. అయితే శుక్ర వారం రోజు ఎవరైతే లక్ష్మీదేవిని సందర్శిస్తారో వారు పూజ సమయంలో అమ్మవారికి తామర పువ్వు సమర్పించాలంట. అంతే కాకుండా ఎర్ర గులాబీలు, మందార పువ్వులు సమర్పించినా, అమ్మవారు ప్రసన్నం అయ్యి, మీ సమస్యలను పరిష్కరిస్తారంట.

లక్ష్మీదేవి అంటే ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ అంటారు పెద్దవారు. అందుకే కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా అమ్మవారికి సారె ఇస్తారు. అయితే అలా ఇవ్వడమే కాకుండా శక్రవారం అమ్మవారిని సందర్శించి, కుంకుమ, బియ్యం, స్వీట్స్ సమర్పిస్తే సంపద పెరుగుతుందంట.

కొబ్బరి స్వచ్ఛతకు గుర్తు. ఇది సహజమైన నీటితో నిండి ఉంటుంది. అలాగే అత్యంత స్వచ్ఛమైనది. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలలో ఇది కూడా ఒకటి. ఇది సమర్పించడం వలన కూడా అమ్మవారు సంతోషిస్తుందంట.ఇవే కాకుండా, మీర్ ఖీర్, హల్వా, చెరుకు, మఖానా, బటాషా, దానిమ్మ, తమలపాకులు, వంటివి అమ్మవారికి సమర్పించడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.