ఇక వేప పుల్లలో ఉన్న గుణాలలు దంతాలకు బలాన్నిస్తాయి. ఇవి మన పళ్ళని చాలా దృఢంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి,వేప ఆకులను ఉదయాన్నే ఖచ్చితంగా నమలాలి. ఎందుకంటే దీని కారణంగా, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ మలవిసర్జన సమయంలో చాలా సులభంగా బయటకు వస్తాయి. మీరు వేప ఆకు నీటిని కూడా తాగవచ్చు. ఈ పద్ధతి ఆరోగ్యానికి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేపలో విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, నింబిన్, నింబిడిన్, లిమోనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.