Bandhan Express Train- కోల్‌కతా రైల్వే స్టేషన్ నుండి బంగ్లాదేశ్ వెళ్లే బంధన్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని పెట్రాపోల్ రైల్వే స్టేషన్‌లో కూడా ఆగుతుంది. ఈ రైలు ద్వారా బంగ్లాదేశ్ వెళ్లవచ్చు. అయితే, ఈ రైలులో భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య ప్రయాణించడానికి చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా అవసరం.
Jayanagar Railway Station- జయనగర్ రైల్వే స్టేషన్ బీహార్‌లోని మధుబని జిల్లాలో ఉంది, ఈ రైల్వే స్టేషన్ ఇండో-నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ స్టేషన్ జనక్‌పూర్ వద్ద కుర్తా స్టేషన్ ద్వారా నేపాల్‌కు అనుసంధానించబడి ఉంది. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్య భారతదేశం-నేపాల్ సరిహద్దు ప్యాసింజర్ రైలు నడుస్తుంది. రైలు సర్వీస్ ఇటీవలే పునఃప్రారంభించబడింది. రెండు దేశాల ప్రజలు రైలు ఎక్కేందుకు పాస్‌పోర్ట్ లేదా వీసా అవసరం లేదు.
Mitali Express- భారతదేశం నుండి ఢాకాకు వెళ్లాలనుకునే వారు మిథాలీ ఎక్స్‌ప్రెస్‌లో న్యూ జల్‌పైగురి జంక్షన్ నుండి ప్రయాణించవచ్చు. హల్దీబారి రైల్వే స్టేషన్ బంగ్లాదేశ్ సరిహద్దు నుండి 4.5 కి.మీ, భారత సరిహద్దు నుండి 7 కి.మీ దూరంలో ఉంది. దూరంగా ఉన్న చిల్హతి రైల్వే స్టేషన్ ద్వారా ఇది బంగ్లాదేశ్‌కు అనుసంధానించబడి ఉంది.
Radhikapur Railway Station- రాధికాపూర్ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఉంది. ఇది కతిహార్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. రాధికాపూర్ రైల్వే స్టేషన్ జీరో పాయింట్ రైల్వే స్టేషన్. ఈ రైలు మార్గం బంగ్లాదేశ్‌లోని బిరల్ రైల్వే స్టేషన్‌కు అనుసంధానించబడి ఉంది. ఇది ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో యాక్టివ్ ట్రాన్సిట్ స్టేషన్‌గా పనిచేస్తుంది. ఈ సరిహద్దు రైల్వే స్టేషన్ సాధారణంగా అస్సాం, బీహార్ నుండి బంగ్లాదేశ్‌కు వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు.
Singhabad Railway Station- సింగాబాద్ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ రోహన్‌పూర్ స్టేషన్ ద్వారా బంగ్లాదేశ్‌కు అనుసంధానించబడి ఉంది. అలాగే, బంగ్లాదేశ్ నుండి నేపాల్ చేరుకోవడానికి గూడ్స్ రైళ్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తాయి. పాత మాల్దా స్టేషన్ నుండి ఈ స్టేషన్‌కు ఒక ప్యాసింజర్ రైలు మాత్రమే వెళుతుంది. అయితే, ఈ సరిహద్దు రైల్వే స్టేషన్ ఈ రెండు ప్రాంతాల మధ్య వస్తువుల ఎగుమతి, దిగుమతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.