
కావాల్సిన పదార్ధాలు: పావుకిలో ఎండు చేపలు, అర కిలో వంకాయలు, 5 పండు టమాటాలు, చిన్న ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి , చింతపండు రసం, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర.

ముందుగా ఎండు చేపలను తీసుకుని క్లీన్ చేయాలి. ఆ తర్వాత ఉప్పుతో కూడా కడిగి కడిగి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి, ఎండు చేపలను కూడా వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.

అదే పాన్ తీసుకుని నూనె వేసి, ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మగ్గించాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా వేయించాలి.

ఇక ఇప్పుడు టమాటా ముక్కలు, వంకాయ ముక్కలను దీనిలో వేసి మగ్గించాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుచేపలను కూడా వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి.

టమాటాలు , వంకాయలు మగ్గిన తర్వాత, చింతపండు రసం, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసి 15 నిముషాల పాటు అలా ఉంచుకోవాలి. చివర్లో కొత్తిమీర వేసుకుని కిందకు దించేయడమే.