
ఢిల్లీ ఎన్సీఆర్ కి ఎయిర్ కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఢిల్లీ సరిహద్దులోని ఉత్తరప్రదేశ్ జేవార్‌లో నిర్మాణం జరుగుతున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 11:30 గంటలకు టెర్మినల్ భవనాన్ని సందర్శించి, మధ్యాహ్నం 12 గంటలకు విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు UP ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొననున్నారు.

భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టుల్లో ఒకటిగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిలవనుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతానికి రెండవ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇది అభివృద్ధి చేయబడింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుబంధంగా పనిచేసి, రద్దీని తగ్గించి, ప్రయాణీకుల సామర్థ్యాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించనుంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 11,200 కోట్లతో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ - PPP మోడల్‌లో నిర్మితమైంది.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది. మొత్తం ప్రాజెక్ట్ నాలుగు దశల్లో (ఫేజ్-1 నుంచి ఫేజ్-4) అభివృద్ధి చేయబడుతోంది. దీని విస్తీర్ణం దశల వారీగా మారుతుంది. మొదటి దశ సుమారు 3,296 ఎకరాలు ఇందులో ఒక రన్‌వే (3,900 మీటర్లు), ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, ATC టవర్, టాక్సీవేస్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.ఈ ఎయిర్ పోర్టు పూర్తి అభివృద్ధి జరిగితే సుమారు 11,750 -12000 ఎకరాలు వరకు విస్తరించనుంది. ఇందులో 5 రన్‌వేలు, అనేక టెర్మినల్స్ ఉండనున్నాయి. మొదటి దశకు సుమారు 3,300 ఎకరాలు ఇప్పటికే సేకరించబడ్డాయి. తదుపరి దశల కోసం అదనపు భూమి సేకరణ జరుగుతోంది..ప్రస్తుతం ప్రారంభమవుతున్న మొదటి దశ 3,296 ఎకరాల్లో ఉంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక హంగులతో నిర్మితమైంది.మొదటి దశలో భాగంగా సంవత్సరానికి 12 మిలియన్ ప్యాసింజర్లు ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. 3,900 మీటర్ల పొడవైన రన్‌వే, వైడ్-బాడీ విమానాలను సులభంగా నిర్వహించగల సామర్థ్యం ఉంది.. అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటల కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS), అధునాతన నావిగేషన్ వ్యవస్థలు, ఎయిర్‌ఫీల్డ్ లైటింగ్ వ్యవస్థలు కలిగి ఉంది

మల్టీ-మోడల్ కార్గో హబ్ : పూర్తి అభివృద్ధి తర్వాత విమానాశ్రయం సామర్థ్యాన్ని 70 మిలియన్ ప్యాసింజర్లు వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో రోడ్డు, రైలు, మెట్రో వ్యవస్థలతో అనుసంధానం కలిగి ఉండటం వల్ల ప్రయాణికులు మరియు సరుకులకు సమర్థవంతమైన అనుసంధానం లభించనుంది. భారతీయ వారసత్వం, సాంప్రదాయ ఘాట్‌లు, హవేలీల సౌందర్యాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో మిళితం చేసి రూపొందించడం దీని ప్రత్యేకత. యమునా ఎక్స్‌ప్రెస్‌వే పక్కన ఉన్న ఈ విమానాశ్రయం ఢిల్లీ-NCR ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా మార్చడంలో కీలకమైన దశగా భావిస్తున్నారు. ఇది రవాణా రంగాన్ని బలోపేతం చేసి, ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వనుంది.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే సైట్‌ను సందర్శించి ప్రారంభోత్సవ సన్నాహాలను సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్ దేశ విమానయాన మౌలిక సదుపాయాలను మరింత బలపరచడంతో పాటు, ప్రాంతీయ-అంతర్జాతీయ అనుసంధానాన్ని మెరుగుపరచనుంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం భారతదేశ విమానయాన రంగంలో ఒక మైలురాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్లో అభివృద్ధి చేయబడుతోంది. ఇది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థ మధ్య భాగస్వామ్యంలో జరుగుతుంది. ప్రధాన అభివృద్ధి సంస్థ యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (YIAPL) ఇది జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ యొక్క పూర్తి స్వంతంగా ఉన్న సబ్సిడరీ సంస్థ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహిస్తున్న సంస్థ ఈ ప్రాజెక్టును 40 సంవత్సరాల కాలానికి డిజైన్, నిర్మాణం, నిర్వహణ చేపట్టింది.2019లో జరిగిన బిడ్డింగ్‌లో జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ AG గెలిచి, 2020లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (NIAL) ఇది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున పనిచేసే ఏజెన్సీ. భూమి సేకరణ, అనుమతులు మొత్తం ప్రాజెక్ట్ పర్యవేక్షణ చేస్తుంది.నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ సివిల్ నిర్మాణ పనులు టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపట్టింది.ఇది భారతదేశంలో మొదటి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విమానాశ్రయ ప్రాజెక్ట్‌లలో ఒకటి.జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ AG ఫేజ్-1కి సుమారు 4,500–11,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది.40 సంవత్సరాల కాలానికి నిర్వహణ బాధ్యత జ్యూరిచ్ సంస్థ తీసుకుంది. ఎయిర్ పోర్టు పర్యవేక్షణ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (NIAL) ద్వారా, నిర్మాణం నిర్వహణ స్విస్ సంస్థ జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ AG యొక్క యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (YIAPL) ద్వారా జరుగుతుంది. PPP మోడల్ ద్వారా స్విస్ నాణ్యత సాంకేతికతను భారతీయ అవసరాలతో మిళితం చేసి అభివృద్ధి చేస్తున్నారు.