Palli Palakova: చుక్క నెయ్యి లేకుండా ఇంట్లోని 3 పదార్థాలతో పల్లీ పాలకోవ

Updated on: Sep 23, 2026 | 4:56 PM

స్వీట్ షాపుల్లో కొనుగోలు చేసే సాంప్రదాయ పాలకోవ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. అయితే పాలకోవ చేయాలంటే లీటర్ల కొద్దీ పాలను గంటల తరబడి మరిగించి కోవాగా మార్చడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. కానీ వంటింట్లో సులభంగా దొరికే వేరుశనగ గుళ్లు, పాలు, పంచదార ఈ మూడంటే మూడు పదార్థాలతో అతి తక్కువ సమయంలో, చుక్క నెయ్యి కూడా లేకుండా అచ్చం స్వీట్ షాప్ పాలకోవాలా నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే అద్భుతమైన 'పల్లీ పాలకోవ'ను ఇంట్లోనే సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. 

1 / 5
కావలసిన పదార్థాలు: 1 కప్పు వేరుశనగ గుళ్లు, అర కప్పు పాలు, అర కప్పు పంచదార, పావు టీస్పూన్ యాలకుల పొడి, ప్లేట్‌కు రాయడానికి కొద్దిగా నెయ్యి (ఇది ఆప్షనల్)
తయారీ విధానం:  స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టి ఒక కప్పు పల్లీలను వేయాలి చేదు, చచ్చు గింజలను ముందే ఏరివేయాలి. మంటను ఒక నిమిషం మీడియం ఫ్లేమ్‌లో, మరొక నిమిషం లో ఫ్లేమ్‌లో ఉంచుతూ పల్లీలు లోపలి వరకు వేగేలా దోరగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు: 1 కప్పు వేరుశనగ గుళ్లు, అర కప్పు పాలు, అర కప్పు పంచదార, పావు టీస్పూన్ యాలకుల పొడి, ప్లేట్‌కు రాయడానికి కొద్దిగా నెయ్యి (ఇది ఆప్షనల్) తయారీ విధానం:  స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టి ఒక కప్పు పల్లీలను వేయాలి చేదు, చచ్చు గింజలను ముందే ఏరివేయాలి. మంటను ఒక నిమిషం మీడియం ఫ్లేమ్‌లో, మరొక నిమిషం లో ఫ్లేమ్‌లో ఉంచుతూ పల్లీలు లోపలి వరకు వేగేలా దోరగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

2 / 5
పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి, మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.  గ్రైండ్ చేసిన పల్లీల పొడిలో అర కప్పు చిక్కటి పాలు పోసి స్పూన్‌తో బాగా కలపాలి. ఆ తర్వాత మిక్సీని మరోసారి తిప్పి మెత్తటి క్రీమీ పేస్ట్‌లా  తయారుచేసుకోవాలి.

3 / 5
ఈ పల్లీ పేస్ట్‌ను మందపాటి పాన్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే అర కప్పు పంచదార వేసి స్టవ్ మీద పెట్టకముందే బాగా కలపాలి. అనంతరం స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్‌పై గరిటెతో కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. పంచదార కరిగి మిశ్రమం మొదట పల్చబడుతుంది; ఆ తర్వాత మరో 5 నుండి 10 నిమిషాలు సిమ్ టు మీడియం మంటపై కలుపుతుంటే మిశ్రమం నెమ్మదిగా చిక్కబడుతుంది.

4 / 5
మిశ్రమం చిక్కబడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసి కలపాలి. మొత్తం 10 నుండి 15 నిమిషాలు ఉడికేసరికి మిశ్రమం పాన్ నుండి సులభంగా విడివడి ముద్దలా తయారవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, నెయ్యి రాసిన ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఫ్లాట్ గిన్నెతో చదరంగా సమానం చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

5 / 5
అనంతరం అరగంట ఫ్రిడ్జ్‌లో ఉంచి, కోవా బిళ్లల్లా లేదా నచ్చిన ముక్కల్లా కట్ చేసుకోవాలి. అంతే, నోట్లో వెన్నలా కరిగిపోయే ప్యూర్ పల్లీ పాలకోవ సిద్ధం. పండుగలప్పుడు నైవేద్యంగా గానీ, ఇంటికి బంధువులు వచ్చినప్పుడు స్వీట్‌గా గానీ చేసి పెడితే అందరూ ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us