
ఈ రెసిపీకి పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ఈ రసం తాగితే మళ్ళీ అదే చేయమని అడుగుతారు. పాత రోజుల్లో ఎంతో ఇష్టంగా తినేవాళ్లు. మీరు ఈ చింత పండు నుంచి గుజ్జు వేరు చేసి రసం చేసుకుని తాగితే మాంసం కూరలు పనికిరావు. మీరు క మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.

పచ్చి పులుసుకు కావాల్సిన పదార్దాలు: కొద్దిగా పచ్చి చింతపండు, మూడు ఉల్లిపాయలు ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, నాలుగు ఎండు మిర్చి, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇంకా కొద్దిగా బెల్లంను కూడా దీనిలో తీసుకోవాలి. వీటితో చేస్తే పులుసు అదిరిపోతోంది.

చింతపండు రసం ఇలా తయారు చేసుకోవాలి : ముందుగా చింతపండును తీసుకుని నీళ్లతో ఒకసారి బాగా కడిగి గ్లాస్ డు గుజ్జు రసం తీసి ఒక పాత్రలో పెట్టాలి. మీరు దీనికోసం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి అప్పటికప్పుడు చేసిన అంత రుచిగా ఉండదు. మీరు చేసేటప్పుడు ఇలా ఫాలో అవ్వండి.

ఇప్పుడు బెల్లం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , కొద్దిగా కొత్తిమీర ఆకులు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి కొద్దీసేపు పక్కన పెట్టాలి. చింత పండు రసంలో పచ్చి జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు కూడా వేసి గరిటెతో మంచిగా తిప్పుకోవాలి. అంతే, పచ్చి పులుసు రెడీ.

అయితే, మీరు అతిగా తీసుకోకండి. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)