
మస్లిన్ తెరల మ్యాజిక్: వేసవి వేడి ఇంటి లోపలికి రాకుండా చూడటానికి కిటికీలకు లేదా తలుపులకు మస్లిన్ తెరలను వేలాడదీయడం చాలా పురాతనమైన పద్ధతి. ఈ తెరలపై కొద్దిగా నీళ్ళు చల్లడం వల్ల, బయటి నుంచి వచ్చే వేడి గాలి ఈ తడి తెరల గుండా ప్రయాణించి, గది అంతటా సువాసనతో కూడిన చల్లని వాతావరణాన్ని సృష్టిస్తుంది.

చందనం పేస్ట్: వేసవిలో చర్మపు చికాకు, చెమటకాయలు, అసౌకర్యాన్ని తగ్గించడానికి చందనం అనాదిగా వాడుకలో ఉంది. నుదుటిపై లేదా చర్మంపై చందనం పేస్ట్‌ను పూయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తక్షణమే తగ్గుతుంది. అందుకే సౌందర్య, ఆరోగ్య చికిత్సలలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అదేవిధంగా మట్టికుండలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

గ్రామీణ మట్టి ఇళ్ల సాంకేతికత: గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల నేలలకు, గోడలకు ప్రత్యేకంగా మట్టి పూత పూసే పద్ధతి ఉంది. ఇది ఒక అద్భుతమైన ఉష్ణ నిరోధకంలా పనిచేస్తూ, మండే ఎండ వేడిమి ఇంటి లోపలికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. పైగా మట్టిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు వేసవిలో ఇల్లు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. అదేవిధంగా శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుకోవడానికి మజ్జిగను చేర్చుకోవడం చాలా ముఖ్యం.

ఆరుబయట నిద్ర: గతంలో వేసవి రాత్రులలో ఇళ్లపై డాబాల మీద లేదా బాల్కనీలలో మంచాలు వేసుకుని ఆరుబయట నిద్రపోవడం ఒక ఆనవాయితీగా ఉండేది. గదిలోని ఉక్కపోతకు బదులుగా, రాత్రిపూట వీచే చల్లటి ప్రకృతి గాలి శరీరానికి వింతైన ప్రశాంతతను ఇస్తుంది. నేటి ఆధునిక కాలంలో ఈ అలవాటు మరుగవుతున్నా, వీలున్నవారు దీనిని ప్రయత్నిస్తే శరీరానికి తిరిగి నూతనోత్తేజం లభిస్తుంది.

ఇంటి పైకప్పులు రోజంతా ఎండకు వేడిగా మారి రాత్రి వేళల్లో గదులను హీటర్‌లా మారుస్తాయి. దీనిని నివారించడానికి పైకప్పులపై తెల్లటి సున్నపు పూతను వేయడం ఒక అద్భుతమైన చిట్కా. తెల్లటి రంగు సూర్యుని రేడియేషన్‌ను తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబిస్తుంది. దీనివల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. మీ ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి ఇంతకంటే చవకైన మార్గం మరొకటి లేదు.