Cholesterol: కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. ముందే పసిగట్టి జాగ్రత్త పడకుంటే గుండె జబ్బులతో అతలాకుతలం

గుండె జబ్బులను సకాలంలో గుర్తించి చికిత్స అందించడంపై కొలెస్ట్రాల్‌పై దృష్టి సారించాలని పేర్కొంది. తద్వారా 80 నుంచి 90 శాతం గుండె జబ్బులను నివారించవచ్చని, ఇందుకోసం సకాలంలో చికిత్స పొందడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఆహారం, వ్యాయామంతో కొలెస్ట్రాల్‌ను నియంత్రించలేకపోతే కాస్తముందుగానే మందులు ప్రారంభించాలట..

Cholesterol: కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. ముందే పసిగట్టి జాగ్రత్త పడకుంటే గుండె జబ్బులతో అతలాకుతలం
Cholesterol

Updated on: Mar 21, 2026 | 7:58 PM

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొలెస్ట్రాల్‌పై షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. గుండె జబ్బులను సకాలంలో గుర్తించి చికిత్స అందించడంపై కొలెస్ట్రాల్‌పై దృష్టి సారించాలని పేర్కొంది. తద్వారా 80 నుంచి 90 శాతం గుండె జబ్బులను నివారించవచ్చని, ఇందుకోసం సకాలంలో చికిత్స పొందడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఆహారం, వ్యాయామంతో కొలెస్ట్రాల్‌ను నియంత్రించలేకపోతే కాస్తముందుగానే మందులు ప్రారంభించాలని వీరి అధ్యయనం పేర్కొంటున్నాయి. తాజా నిబంధనల ప్రకారం, చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. 30 ఏళ్ల వయస్సులో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే అదే వయస్సులో మందులు ప్రారంభించాలని ఈ మార్గదర్శకాలు చెబుతున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎంత తక్కువగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని కూడా ఈ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.

ప్రతి ఒక్కరికి LDL (చెడు కొలెస్ట్రాల్‌) 100 mg/dL కంటే తక్కువగా ఉంచుకోవాలి. గుండెపోటు లేదా పక్షవాతం వచ్చిన వారు దానిని 55 mg/dL కంటే తక్కువగా ఉంచుకోవాలి. గుండె జబ్బుల ప్రమాదం ఉన్నవారు దానిని 70 mg/dL కంటే తక్కువగా ఉంచుకోవాలి. నేటి కాలంలో అయితే 30 ఏళ్ల వయస్సు నుండే తమ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం ప్రారంభించాలి. ఒకవేళ అది అధికంగా ఉంటే, భవిష్యత్తులో గుండె జబ్బులను నివారించడానికి డాక్టర్ల సూచనల మేరకు మందులతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాలి.

కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది..

  • కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉంటే
  • మధుమేహం
  • ఆటో ఇమ్యూన్ వ్యాధి

ఏ వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి?

  • 40 ఏళ్లు పైబడిన వారు
  • మధుమేహం
  • అధిక రక్తపోటు ఉన్న రోగులు
  • కుటుంబంలో గుండె జబ్బులు
  • మూత్రపిండాల రోగులు
  • హెచ్ఐవీ
  • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఏం చేయాలి?

  • ఆరోగ్యకరమైన ఆహారం
  • ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
  • పొగతాగకూడదు
  • బరువును అదుపులో ఉంచుకోవాలి.
  • ప్రతిరోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మన దేశంలో గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెడు కొలెస్ట్రాల్ 100 కంటే తక్కువ కాకపోతే, వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ప్రారంభించాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. అలాగే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో పిండి, నూనెలు తక్కువగా వినియోగించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us