
సంబంధం అనేది.. ప్రేమ, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అయితే, లవ్ రిలేషన్‌షిప్ (ప్రేమ సంబంధం) చాలా విలువైనది.. అతికొద్దిమంది అదృష్టవంతులకే అది వివాహం వరకు చేరుకుంటుంది. ఏ ప్రేమ సంబంధంలోనైనా ఎదుటివారి భావోద్వేగాలు, గౌరవాన్ని కాపాడుకోవడం, నమ్మకం వమ్ముకాకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. భాగస్వామి హృదయాన్ని గాయపరిచే మాటలు మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. సాధారణంగా ఇద్దరు ప్రేమికులు, భాగస్వాములు ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉంటారు అనడంలో సందేహం లేదు.. అయితే, రిలేషన్‌షిప్ లో ఏదైనా దాచడానికి ప్రయత్నించవచ్చు.. కానీ ప్రతి సంబంధానికి ఒక పరిమితి ఉంటుంది. ప్రతి వ్యక్తికి కొంత పర్సనల్ స్పెస్ ఉంటుంది.. దీనిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం.. అయితే, మన భాగస్వామిని ఎప్పుడూ మనం ఎలాంటి ప్రశ్నలు అడగకూడదో తెలుసుకోవడం ఉత్తమం.. దీనిద్వారా.. రిలేషన్‌షిప్ ను దీర్ఘకాలంగా కొనసాగించవచ్చు..లేకపోతే మీ సంబంధం చెడిపోయే అవకాశం ఉంది. అయితే, పొరపాటున కూడా మీ భాగస్వామిని అడగకూడని ప్రశ్నలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

కాల్ వివరాలు అడగవద్దు: రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మీ భాగస్వామి మీతో ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు వారు.. తమ అవసరాలను బట్టి ఇతర వ్యక్తులతో కూడా మాట్లాడతారు. అయితే, మీరు వారికి కాల్ చేసినప్పుడు.. వారి ఫోన్ బిజీగా ఉంటే, అనవసరంగా అనుమానించకండి. చాలా మంది కాల్ వివరాలు లేదా స్క్రీన్‌షాట్‌ల కోసం అడుగుతారు.. ఇది చాలా తప్పు విధానం. ఇది భాగస్వామికి చికాకు కలిగించవచ్చు.

స్నేహితుల వివరాలను అడగవద్దు: ఎవరికైనా ఫ్రెండ్స్ ఉండటం కామన్.. అయితే, భాగస్వామికి స్నేహితులు ఎక్కువగా ఉంటే.. వివాహం తర్వాత ఆ వ్యక్తి వారితో గడిపే సమయం తక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఇలాంటి సమయంలో మీరు మీ భాగస్వామిని అతని/ఆమె స్నేహితుల జాబితా కోసం ఎప్పుడూ అడగకూడదు. ఎందుకంటే ఎక్కువగా అడగడం వల్ల సంబంధంలో చీలిక వస్తుంది.

పాస్‌వర్డ్ అడగవద్దు: రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలు తరచుగా ఒకరి బ్యాంక్ ఖాతా, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లేదా మొబైల్ పాస్‌వర్డ్‌లను పంచుకుంటారు. కానీ, వారి వ్యక్తిగత వివరాలు పంచుకోవాలంటూ వారిని బలవంతం చేయవద్దు. ఎందుకంటే కొంతమంది దానితో అసౌకర్యంగా భావిస్తారు.

గతం గురించి మళ్లీ మళ్లీ అడగవద్దు: మీ భాగస్వామికి గత ఎఫైర్ లేదా బంధం ఉండే అవకాశం ఉంది. వారు దానిని మరచిపోవాలని, ముందుకు సాగాలని కోరుకుంటారు. కానీ మీరు వారి మాజీ గురించి పదేపదే అడిగితే, అది ఆ వ్యక్తిని కలవరపెడుతుంది. ఎందుకంటే పాత విషయాలను, గాయాలను పదేపదే చెప్పమనడం మంచిది కాదు.