
ఈ మధ్య కాలంలో వర్క్ టెన్షన్, లైఫ్‌స్టైల్ కారణంగా జనాలు రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిలో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు, చేతులు, కాళ్ళు, కీళ్లలో నొప్పిలు కనిపిస్తాయి.

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల అధిక రక్తపోటు, థైరాయిడ్, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ సమస్యను అదిగమించేందుకు జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల మందులను వాడి ఉంటారు. కానీ దీనికి పూర్తి పరిష్కారం పొందలేరు.

కానీ మన ఇంట్లో దొరికే మజ్జిగలో కొన్ని ఆకులను కలిపి తాడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవును యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, పెరుగు తినడం కంటే మజ్జిగ తాగడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

అయితే మరిన్ని సత్పలితాలను పొందాలంటే మజ్జిగలో కొన్ని కరివేపాకులు కూడా యాడ్ చేసుకొని తాగండి. ఇందుకోసం మీరు ఒక గ్లాసు మజ్జిగలో 10 నుండి 15 కరివేపాకు వేసి మూతపెట్టి ఉంచండి. గంట తర్వాత ఆ మజ్జిగను తాగండి. ఇలా కాకపోతే మీరు కరివేపాకును పొడిగా చేసుకొని కూడా మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు.

కరివేపాకులో ఉండే పోషకాలను రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడంతో బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలాగే కరివేపాకు కిడ్నీలో రాళ్లను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఇది సహాయకంగా మాత్రమే పనిచేస్తుంది. పూర్తి చికిత్స కాదు. యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.(Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)