
రోజు రోజుకు మారుతున్న జీవనశైలిలో మధుమేహం, రక్తహీనత వంటివి సర్వ సాధారణం అయిపోయాయి. అయితే, వీటిని తగ్గించడం కోసం ఎన్నో రకాల మందులు వాడుతారు. అయితే, వీటిలో ప్రకృతి నుంచి వచ్చే ఈ అద్భుతమైన ఆకు మంచిగా పని చేస్తుంది. ఇంకా ఐరన్, కాల్షియం కూడా దీనిలో దొరుకుతుంది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

మీకు ఈ మునగ చెట్టు ఊర్లలో కనిపిస్తుంది ఇక రోడ్డు పక్కన ఐతే బాగానే కనిపిస్తుంది. అలాగే, కొందరు ఇంటి పెరట్లో పెంచుకుంటారు. ఈ మునగకాడలని మీరు కూర లాగా చేసుకోవచ్చు ఇంకా వీటిని ముక్కలుగా కట్ చేసి సాంబార్లో వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా దీనిని మీరు పులుసు లాగా కూడా చేసుకుంటారు. ఈ కాయలే కాకుండా ఆకులు కూడా ఉపయోగపడతాయి.

మునగ ఆకుతో ఎక్కువగా పప్పు,పచ్చడి ఇలా అన్న చేసుకొని తినవచ్చు. ఈ ఆకులలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఇంకా ప్రతి రోజు ఒక టేబుల్ స్పూన్ స్పూన్ మునగ ఆకు పొడిని తీసుకుంటే బ్లడ్ లో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఇంకా డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.

దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్ క్లోరోజెనిక్ ఆమ్లం టైప్ -2 డయాబెటిస్ రోగులలో రక్తంలోని చక్కెర, రక్తపోటును కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకా మునగ ఆకులలో ఉండే కాల్షియం భరించలేని నొప్పులను తగ్గించి ఎముకలు బలంగా అయ్యేలా చేస్తుంది. ఈ ఆకులలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.

అయితే, దీనిని మీరు మీ ఆరోగ్య సమస్యలు బట్టి మితంగానే తీసుకోవాలి. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)