రాత్రి సమయంలో ఆపిల్ తినడం మంచిదేనా?

samatha

10 september 2026

Pic credit - Pinterest

ఆపిల్ పండు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క పండు వంద రోగాలను నయం చేస్తుంది.

అందుకే చాలా మంది అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యే వారికి ఆపిల్ పండ్లను కొనుగోలు చేసి ఇవ్వడం మనం చూస్తుంటాం.

ఎందుకంటే? వీటిలో యాటీఆక్సిడెంట్స్ , విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండటం వలన , అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుతుంది.

ప్రతి రోజూ ఒక ఆపిల్ పండు తింటే ఎలాంటి రోగాలు దరిచేరవు అని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు.

అయితే కొంత మంది రాత్రి సమయంలో ఆపిల్ పండు తింటారు. మరి ఇలా రాత్రి సమయంలో ఆపిల్ తినడం మంచిదేనా? అంటే?

రాత్రి సమయంలో ఆపిల్ పండు తినడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అనేక సమస్యలు ఎదురు అవుతాయంట.

ముఖ్యంగా రాత్రి సమయంలో ఆపిల్ పండు తినడం వలన ఇది ఎసిడిటీ వంటి సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అంతే కాకుండా దీనిని తినడం వలన ఇది మలబద్ధకం సమస్యను పెంచుతుందంట. కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం సమస్యలు పెరుగుతాయి.