
ట్రావెలింగ్ అనేది ప్రతి ఒక్కరికి.. తమ జీవితంలో కొత్త అధ్యయాన్ని పరిచయం చేస్తుంది. అలాంటి వాటి జాబితాలో కొన్ని రైల్వే ప్రయాణాలు కూడా ఉన్నాయి. వాటిని మనం కచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. వీటిలో మొదటిది కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్, యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కలిగిన ఈ నారో గేజ్ రైలు, 102 సొరంగాల గుండా ప్రయాణిస్తుంది, పైన్ అడవులు, మంచుతో కప్పబడిన శిఖరాల గుండా హిమాచల్ కొండలను అధిరోహిస్తు పచ్చని ప్రకృతిని చూయిస్తుంది.

డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (టాయ్ ట్రైన్): ఆవిరితో కూడిన టీ, మంచుతో కూడిన ఉదయాలు ఇవి కాంచన్‌జంగా అందమైన దృశ్యశాలు. న్యూ జల్పైగురి నుండి డార్జిలింగ్ వరకు సాగే ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికుల స్వర్గదామమనే చెప్పాలి. బటాసియా లూప్‌లో కనిపించే హిమాలయ దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తాయి.

కాంగ్రా వ్యాలీ రైల్వే: అద్భుతమైన రైల్వే ప్రయాణాల్లో కాంగ్రా వ్యాలీ రైల్వే కూడా ఒకటి. దీని గురించి చాలా మందికి తెలియదు. కానీ చాలా అద్బుతంగా ఉంటుంది. ఇది పఠాన్‌కోట్ నుండి ప్రారంభమై అందమైన కాంగ్రా వ్యాలీ గుండా వెళుతుంది. ఇక్కడ మీరు మంచుతో కప్పబడిన ధౌలాధర్ పర్వతాలను, లోయల ప్రశాంతతను ఆస్వాదించవచ్చు.

జమ్మూ-బారాముల్లా రైలు: ఈ 356 కి.మీ ప్రయాణం మిమ్మల్ని కాశ్మీర్ లోయ గుండా తీసుకెళుతుంది, ఇది శీతాకాలంలో మంచుతో కూడిన ప్రకృతి దృశ్యంలా కనిపిస్తుంది. ఈ ప్రయాణంలోనే చీనాబ్ వంతెన వంటి ఇంజనీరింగ్ అద్భుతాలను మీరు చూడవచ్చు.

నీలగిరి పర్వత రైల్వే: దక్షిణ భారతదేశంలోని ఈ యునెస్కో వారసత్వ రైలు ప్రయాణం మెట్టుపాళయం నుండి ఊటీ వరకు నడుస్తుంది. చల్లని స్పష్టమైన ఆకాశం కింద పచ్చని తేయాకు తోటలు, దట్టమైన అడవులు ఈ ప్రయాణాన్ని మరింత ఉల్లాసంగా చేస్తాయి.