
భారత దేశం చరిత్ర దాని రక రకాల రుచికరమైన వంటకాలకు కూడా గొప్పగా ప్రసిద్ధి చెందినది. ముఖ్యంగా ఈ కాలంలో చాలా మంది బిర్యానీ, కబాబ్, తందూరీ చికెన్ ఇలాంటి వంటకాలను ఎక్కువ ఇష్టంగా తయారు చేయడమే కాకుండా తింటాము. అయితే ఒక రకమైన చికెన్ వంటకం చాలా అద్భుతమైన రుచిని ఇస్తుందంట. అంతే కాకుండా అది ఉడకడానికే ఏకంగా 24 గంటలు పడుతుందంట. ఇది రాజులు, చక్రవర్తుల ఫేవరెట్ డిష్ అంటున్నారు. ఇంతకీ ఆ వంటకం ఏమిటి అంటే?

ముర్గ్ జామిన్ దూజ్, అంటే భూమిలోపల వండే వంటకం. ఇది పేరుకు తగ్గట్టుగానే, మట్టి కుండలో తక్కువ మంటపై ఉంచి, ఎక్కువ సేపు వండుతారంట. అన్ని వంటకాల్లోకెల్లా ఇది చాలా ప్రత్యేకమైనది. దీని కోసం మందుగా కోడి మాంసాన్ని తీసుకుంటారు. దీనికి పెరుగు, యాలకులు, కుంకుమ పువ్వు, బాదం, వంటి సుగంధ ద్రవ్యాలతో దీనిని ఊరబెడతారు.

తర్వాత కోడి మాంసం చుట్టూ రుమాల రోటీ చాలా గట్టిగా స్పేస్ లేకుండా చుడతారు. తర్వాత దానిని ఒక మట్టి కుండలో పెడతారు. తర్వాత ఆ కుండను కూడా రోటీ పిండి సహాయంతో పూర్తిగా గాలి చొరబడకుండా కప్పివేస్తారు. ఇలా చేయడం వలన కుండలోని ఆవిరి బయటకు పోకుండా, కేవలం మాసం దానిలోని ఉన్న రసాయనాలతోనే మెత్తగా ఉడుకుతుంది.

అయితే చాలా వరకు ఏ వంటకం అయినా గంట రెండు లేదా మూడు గంటలు పడుతుంది. కానీ ఈ రకమైన వంటకం మాత్రం ఏకంగా 24 గంటలు ఉడుకుతుందంట. అంతే కాకుండా దీని రుచికూడా చాలా అద్భుతంగా ఉంటుందంట. అందుకే మొఘల్ కాలంలో రాజులు, చక్రవర్తలు ఫేవరెట్ డిష్ ఇదేనంట. అందుకే అక్బర్ పాలనలో రాజ వంటశాలలో ఈ ప్రత్యేకమైన వంటకం తప్పకుండా ఉండేదంట.