Mrigasira karthi: కొర్రమీనుకు రెక్కలొచ్చాయి.. మృగశిరను క్యాష్‌ చేసుకుంటున్న వ్యాపారులు

|

Jun 09, 2023 | 11:44 AM

మృగశిర కార్తెను పురస్కరించుకొని మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గురువారం హైదరాబాద్‌ వ్యాప్తంగా చేపల మార్కెట్లో జనాలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారు. భారీగా డిమాండ్‌ పెరగడంతో వ్యాపారస్తులు సైతం ధరలను పెంచేశారు...

1 / 5
 మృగశిర కార్తె ప్రభావంతో చేపల ధరలకు రెక్కలొచ్చాయి.. చేపలు తినాలనే సెంటిమెంట్ తో జనం చేపల మార్కెట్ కు పరుగులు తీస్తున్నారు.. ఇదే అదునుగా వ్యాపారులు చేపల ధరలు అమాంతం పెంచేశారు.

2 / 5
మృగశిర కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగనే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది.

3 / 5
మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. గురువారం హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లు వినియోగదారులతో కిక్కిరిశాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం గ్రేటర్‌ వ్యాప్తంగా సుమారు 3 లక్షల కిలోల చేపల విక్రయాలు జరిగినట్లు సమాచారం.

4 / 5
మృగశిర కార్తె ఎఫెక్ట్‌తో కొర్రమీను ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలోకు రూ.320 పలుకుతుండగా.. ప్రస్తుతం రూ.500 నుంచి రూ. 650 వరకు విక్రయించారు. బొచ్చ, రవ్వు చేపలను కిలో రూ.120 నుంచి రూ. 150కి, పాంప్లేట్‌ రూ. 90–120 విక్రయించారు.

5 / 5
ఇక మృగశిర కార్తె రోజు కచ్చితంగా చేపలు తినాలను చెబుతుంటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తె రావడంతో వర్షాలు మొదలు కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు, ఇతర వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందేనని చెబుతుంటారు.