
Emerald Necklace: పచ్చ హారము నవనగర్ మహారాజు కోసం తయారు చేసిన పచ్చ హారము దాని రూపకల్పనకు చాలా ప్రసిద్ధి చెందింది. ఆర్ట్ డెకో శైలిలో జాక్వెస్ కార్టియర్ రూపొందించిన ఈ నెక్లెస్ మొత్తం 277 క్యారెట్ల బరువున్న 17 దీర్ఘచతురస్రాకార కొలంబియన్ పచ్చలతో తయారు చేయబడింది. మధ్యలో 70 క్యారెట్ల బరువున్న పచ్చ టర్కీయే మాజీ సుల్తాన్‌కు చెందినదని చెబుతారు.

Indore Pear Necklace: ఇండోర్ పియర్ నెక్లెస్‌ను ఇండోర్‌కు చెందిన రాజా యశ్వంత్ రావ్ హోల్కర్ II తన భార్య మహారాణి సంయోగితా దేవి కోసం తయారు చేశారు. ఈ నెక్లెస్‌లో బేరి లాంటి వజ్రాలు ఉన్నాయి.

Noor Jahan, Taj Mahal Necklace: ఈ నెక్లెస్ ప్రేమ, అద్భతమైన కళా నైపుణ్యతకు ఉదాహరణగా నిలుస్తుంది. ఈ నెక్లెస్ కార్టియర్ చేత తయారు చేయబడింది. ఇది అందమైన బంగారం, కెంపులతో కూడిన తుషార వజ్రాల కలయిక. నిజానికి దీనిని జహంగీర్ తన భార్యపై ప్రేమతో తయారు చేయించాడని చెబుతారు.

Patiala Necklace: పాటియాలా నెక్లెస్ మహారాజా భూపీందర్ సింగ్ పాటియాలా హార్‌ను తయారు చేయించాడు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్ ఇదే. ఈ నెక్లెస్‌లో 2930 వజ్రాలు పొదగబడ్డాయి. మధ్యలో 234 క్యారెట్ల పసుపు వజ్రం పొదిగి ఉంటుంది. ఈ నెక్లెస్ ధర 112 కోట్లకు పైగా ఉంది.

Patiala Ruby Choker: పాటియాలా రూబీ చోకర్ 1931లో పాటియాలా మహారాజా భూపిందర్ సింగ్ కోసం కార్టియర్ ఆఫ్ ప్యారిస్ రూపొందించారు. ఇందులో రూబీ, ముత్యాలు, వజ్రాలతో తయారు చేసిన ఈ చోకర్ ప్రజాదరణ పొందింది. దీనిని పాటియాలా రూబీ చోకర్ అని పిలుస్తారు. ఈ నెక్లెస్ ధర ఎనిమిది కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ హారాన్ని బక్తావర్ కౌర్ సాహిబాకు బహుమతిగా ఇచ్చారు.

'star Of The South' Diamond: ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో 'స్టార్ ఆఫ్ సౌత్' ఒకటి. ఇది 1853లో బ్రెజిల్‌లో గుర్తించారు. ఇది బరోడా రాణి వద్ద ఉండేది.. మహారాజా ఖండేరావ్ గైక్వాడ్ ఈ వజ్రం నుండి ఒక హారాన్ని తయారు చేసాడు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ నెక్లెస్ మూడు హారాల కలయికగా తయారు చేశారు.