ఎత్తైన కొండలు, తిరిగేటి రోడ్లు.. గుండె గుబేలుమంటది..! జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు..!

Updated on: Apr 28, 2025 | 6:34 PM

భారతదేశం అనేక గొప్ప పర్వత ప్రాంతాలకు నిలయంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన, ప్రమాదకరమైన పర్వత మార్గాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ మార్గాలు ప్రకృతి సౌందర్యంతో మంత్రముగ్ధం చేస్తాయి. అయితే కఠినమైన భూభాగాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ఇరుకైన రహదారులు సాహస యాత్రికులకు ప్రమాదకరంగా మారుతాయి.

1 / 6
సెలా పాస్ (Arunachal Pradesh Sela Pass).. 4,170 మీటర్ల (13,680 అడుగులు) ఎత్తులో ఉన్న సెలా పాస్ అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఈ ప్రదేశం పొగమంచు, మంచు, కఠినమైన వాతావరణానికి ప్రసిద్ధి. ఇక్కడ రహదారి చాలా ఇరుకుగా ఉంటుంది. తరచుగా మంచుతో కప్పబడి ఉండటం వల్ల ప్రయాణికులకు ప్రయాణం క్లిష్టంగా మారుతుంది. హిమపాతాలు, కొండచరియలు విరిగిపడటం కూడా ఇక్కడ సాధారణం.

2 / 6
ఖర్దుంగ్ లా పాస్ (Ladakh Khardung La).. ఖర్దుంగ్ లా పాస్ 5,359 మీటర్ల (17,582 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది భారతదేశంలో అత్యధికంగా సందర్శించే పర్వత మార్గాలలో ఒకటి. ఇది ప్రతి సాహస యాత్రికుడి కలల గమ్యస్థానం. కానీ ఇక్కడ రహదారి పరిస్థితులు తరచుగా ఇబ్బందిగా ఉంటాయి. ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ప్రయాణికులు ఆల్టిట్యూడ్ సిక్‌ నెస్‌ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

3 / 6
రోహ్తాంగ్ పాస్ (Himachal Pradesh Rohtang Pass).. రోహ్తాంగ్ పాస్ 3,978 మీటర్ల (13,051 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది మనాలి, లేహ్ మధ్య కీలకమైన మార్గం. ఇక్కడ సవాలుతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. తరచుగా మంచు కూలిపోవడం జరుగుతుంది. వంకర రహదారులు, కొండచరియలు విరిగిపడడం వల్ల ఈ మార్గం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఇక్కడ ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

4 / 6
జోజిలా (Jammu and Kashmir Zoji La).. శ్రీనగర్-లేహ్ హైవేలోని జోజిలా 3,528 మీటర్ల (11,575 అడుగులు) ఎత్తులో ఉంది. ఈ మార్గం కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నదిగా గుర్తించబడింది. శీతాకాలంలో రహదారులు పూర్తిగా మంచుతో కప్పబడి ఉండి ట్రాఫిక్‌ను నిలిపేస్తుంది. ఈ పరిస్థితులు ప్రయాణాన్ని మరింత ప్రమాదకరంగా చేస్తుంది.

5 / 6
నాథు లా (Sikkim Nathu La).. నాథు లా 4,310 మీటర్ల (14,140 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది భారత్-చైనా సరిహద్దుకు దగ్గరలో ఉంది. తీవ్రమైన వాతావరణం వల్ల ఈ మార్గం ప్రమాదకరంగా మారింది. ఇక్కడ మంచు తుఫానులు, కొండచరియలు విరిగిపడటం తరచూ జరుగుతుంది. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కూడా ప్రయాణానికి కొన్ని పరిమితులు ఉంటాయి.

6 / 6
చాంగ్ లా (Ladakh Chang La).. చాంగ్ లా 5,360 మీటర్ల (17,590 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలో ఎత్తైన మోటరబుల్ పాస్‌ లలో ఒకటి. ఇక్కడ తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల యాత్రికులు అప్రమత్తంగా ఉండాలి. అనూహ్యంగా వాతావరణం మారిపోవడం, మంచు తుఫానులు సాధారణం కావడం వల్ల ప్రయాణం చేసే ముందు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం అవసరం.