
బ్లాక్ కాఫీ తాగడం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బ్లాక్ కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది, ఇది మన శరీరాన్ని ఎక్కువసేపు శక్తివంతంగా ఉంచుతుంది. ఇందులో చక్కెర ఉండదు కాబట్టి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల రోజంతా మనస్సు ఉత్సాహంగా ఉంటుంది.

డయాబెటిస్ నియంత్రణ: బ్లాక్ కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని అనేక అధ్యయనాలు చూపించాయి. బ్లాక్ కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తాయి, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. ఒక అధ్యయనం ప్రకారం, రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని 7% వరకు తగ్గించవచ్చు.

బరువు తగ్గడం: కేలరీలు తక్కువగా ఉండి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లాక్ కాఫీ తాగడం వల్ల జీవక్రియ పెరగడమే కాకుండా, బరువు తగ్గడానికి అద్భుతమైన పానీయంగా కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కాలేయ ఆరోగ్యం: అలాగే కాలేయ ఆరోగ్యానికి సైతం ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని.. రోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుందని, హానికరమైన ఎంజైమ్‌ల (ALT/AST) స్థాయిలు తగ్గుతాయని. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

హ్యాపీ హార్మోన్లు: బ్లాక్ కాఫీ గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల డోపమైన్, సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లు పెరుగుతాయియని. ఈ న్యూరోట్రాన్స్మిటర్లు ఆనంద భావనలతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే, బ్లాక్ కాఫీ "హ్యాపీ హార్మోన్లను" పెంచుతుంది.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)