Monsoon Health Tips: వర్షాకాలంలో ఇంట్లోనే ఈ సింపుల్ వ్యాయామాలు చేయండి.. హెల్త్ అండ్ ఫిట్ గా ఉండండి..

|

Jul 15, 2024 | 11:03 AM

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ శారీరకంగా ఫిట్ గా ఉండాలనుకుంటున్నారు. అయితే వర్షాకాలంలో కురిసే వర్షాల వలన జిమ్ కు వెళ్ళడం కష్ట తరమే.. అయితే వర్షాకాలంలో వ్యాయామం చేసి తద్వారా ఫిట్‌నెస్‌గా ఉండాలనుకుంటారు. అదే సమయంలో వర్షం కురుస్తుంటే వేడి వేడి మిర్చి బజ్జీలు, సమోసాలు, పకోడాలు వంటి వాటిని ఇష్టంగా తింటారు. అయితే దీని వల్ల పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం కూడా సవాలుతో కూడుకున్నది. అయితే చాలా మందికి వర్షాకాలంలో జిమ్‌కి వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంట్లోనే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం ద్వారా ఫిట్‌గా ఉండొచ్చు. ఆ వ్యాయామాలు ఏమిటో తెలుసుకుందాం..

1 / 5
స్క్వాట్ అనేది కేలరీలను బర్న్ చేయడానికి మరియు బరువును అదుపులో ఉంచడానికి ఒక గొప్ప వ్యాయామం. ఇది దిగువ శరీరంలోని కండరాలను కూడా బలపరుస్తుంది. దీంతోపాటు బలం కూడా పెరుగుతుంది. రోజూ స్క్వాట్‌లు చేయడం వల్ల కాళ్లు, నడుము ఆకారంలో ఉండేందుకు, కండరాలు టోన్ అవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మోకాలి కీళ్లను కూడా బలంగా ఉంచుతుంది.

2 / 5
కడుపులో పేరుకుపోయిన కొవ్వును తగ్గించాలనుకుంటే ప్లాంకింగ్ ఉత్తమ వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఇది బొడ్డు దగ్గర పేరుకున్న కొవ్వును వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది.  ఉదర కండరాలను టోన్ చేస్తుంది. ప్రారంభంలో సాధారణ ప్లాంక్ చేయాలి. అయితే  ప్లాంకింగ్ చేసే సమయం 20 నుండి 30 సెకన్లు ఉండాలి. దీని తరువాత ప్లాంకింగ్ చేసే సమయాన్ని క్రమంగా పెంచుకోవచ్చు.

3 / 5
శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చడం, బలాన్ని పెంచడంతో పాటు స్కిప్పింగ్ కేలరీలను బర్న్ చేయడానికి చాలా మంచి శారీరక శ్రమ. స్కిప్పింగ్ ను ఇంట్లో సులభంగా చేయవచ్చు. రోప్ జంప్ చేయడం రాకపోతే సింపుల్ జంప్, జంప్ అండ్ జాక్, లెగ్ క్రిస్-క్రాస్ జంప్ వంటివి చేయవచ్చు.

4 / 5

బొడ్డు కొవ్వును తగ్గించడానికి ఇంట్లో వ్యాయామాల గురించి మాట్లాడితే క్రంచెస్ చేయవచ్చు. ఇందులో రివర్స్ క్రంచ్ (ఇందులో వెనుకకు నేలపై పడుకుని, చేతులను నడుము క్రింద ఉంచి కాళ్ళను పైకి లేపి వెనుకకు తీసుకుని, ఆపై వాటిని వెనక్కి తీసుకురావాలి). అదేవిధంగా క్రిస్-క్రాస్ క్రంచ్ చేయాలి. దీనిలో కుడి మోచేయిని ఎడమ మోకాలితో తాకాలి.. ఎడమ మోచేయిని కుడి మోకాలితో తాకాలి. ఈ ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటి పునరావృతం చేయాలి.

5 / 5
ఇంట్లోనే స్ట్రెయిట్ లెగ్ గాడిద కిక్ వ్యాయామం కూడా చేయవచ్చు. ఈ వ్యాయామం తుంటిపై పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంలో పాటు కండరాలను టోన్ చేయడంలో సహాయపడుతుంది. ఇది బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. భుజం కండరాలను బలపరుస్తుం. అంతేకాదు శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది.