తల నొప్పి చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. తలనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. అనారోగ్య కారణాల వల్ల కొన్నిసార్లు తలనొప్పి వస్తే.. మరికొన్నిసార్లు తినకపోవడం, సరైన నిద్ర లేకపోవడం వల్ల, ఒత్తిడి కారణంగా కూడా వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్లు మెగ్రైన్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం.
మైగ్రేన్ సమస్య నుంచి బయటపడాలంటే.. ముందుగా మీ జీవనశైలిని సరైన రీతిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సమయానికి తినడం, తగినంత నిద్రపోవడం, వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు.
మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు మద్యానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా రెడ్ వైన్‌కు దూరంగా ఉండాలి. అలాగే కాఫీ, టీ ని తీసుకోవడం తగ్గించాలి. అతిగా మద్యం, కెఫిన్ పదార్థాలు తాగడం వల్ల మైగ్రేన్ సమస్య మరింత పెరుగుతుంది.
migraine
ప్రాసెస్ చేసిన మాంసాహారాలను కూడా తినొద్దు. ఇది మైగ్రేన్ సమస్యను పెంచుతుంది. ఇక కెఫిన్ కలిగిన చాక్లెట్లు తినొద్దు.
మైగ్రేన్ సమస్య తగ్గాలంటే.. శరీరానికి తగినంత నీళ్లు తాగాలి. నిద్రపోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, రోజూ వ్యాయామం చేయాలి. సరైన జీవనశైలిని పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండడొచ్చు. మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.