AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగ యోగం, ధనలాభం..బుధుడు అస్తంగత్వంతో వీరికి జాక్‌పాట్..!

Mercury Combustion in Libra: ఈ నెల(అక్టోబర్) 29 నుంచి నవంబర్ 14 వరకు తులా రాశిలో బుధ గ్రహం అస్తంగత్వం చెందడం జరుగుతోంది. బుధుడు రవి గ్రహానికి బాగా దగ్గరైనప్పుడు దగ్ధం కావడం లేదా మాడిపోవడం జరుగుతుంది. జ్యోతిషశాస్త్రంలో దీన్ని అస్తంగత్వం అంటారు. బుద్ధి, ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాలు, ప్రణాళికలు, లావాదేవీలు, సమస్యల పరిష్కారం, ఆదాయ వృద్ధి వంటికి కారకుడైన బుధుడు తనకు మిత్ర క్షేత్రమైన తులా రాశిలో అస్తంగత్వం చెందడంవల్ల కొన్ని రాశులకు తప్పకుండా శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకరం, కుంభ రాశులకు ఈ అస్తంగత్యం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 27, 2026 | 5:55 PM

Share
మేషం: ఈ రాశికి పరమ పాపి అయిన బుధుడు సప్తమ స్థానంలో అస్తంగతుడైనందువల్ల ఉద్యోగంలో  సమర్థతకు, బుద్ధి బలానికి అనుకోని గుర్తింపు లభిస్తుంది. అధికారులకు సంబంధించిన కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తారు. వృత్తి, వ్యాపారాలను కొద్దిపాటి మార్పులతో లాభాల బాట పట్టిస్తారు. ఆస్తి వివాదాలు రాజీ మార్గంలో పరిష్కారమవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు సమసిపోతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.

1 / 6
కర్కాటకం: తృతీయ, వ్యయాధిపతిగా ఈ రాశికి పాప గ్రహమైన బుధుడు చతుర్థ స్థానంలో అస్తంగత్వం చెంది నందువల్ల ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి కోలుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల బెడద తగ్గుతుంది. నిరుద్యోగులకు తగిన ఉద్యోగం లభిస్తుంది. గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

2 / 6
సింహం: ఈ రాశికి ద్వితీయ, లాభాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో దగ్ధమైనందువల్ల ఉద్యోగం లోనూ, కుటుంబపరంగానూ ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం సత్ఫలితాలనిస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. పలుకుబడి కలిగిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

3 / 6
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో బుధుడు దగ్ధం కావడం వల్ల ధనాదాయం బాగా వృద్ధి చెంది,  ముఖ్య మైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు, అవసరాలు తీరిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో, కొన్ని వ్యూహాలతో లాభాలను పండిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది.

4 / 6
మకరం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న బుధుడు అస్తంగతుడు అయినందువల్ల ఉద్యోగంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ధన లాభాలు ఎక్కువగా కలుగుతాయి. ఏ పని చేపట్టినా, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

5 / 6
కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధుడు అస్తంగతుడు కావడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మీ సమర్థత మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. సంపద బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.

6 / 6
Follow Us