
ప్రకృతిలో పెరిగే ప్రతి మొక్క ఏదోక వ్యాధిని తగ్గించగలవు. కొన్ని మనల్ని కాపాడతాయి. మరికొన్ని విషపూరితంగా ఉంటాయి. అయితే, ఎంతటి విషాన్ని అయినా మార్చే శక్తీ ఆయుర్వేదానికి మాత్రమే ఉంది.

వాటిలో ముషిణి గింజలు కూడా ఒకటి. వీటిని మనం 'విషముష్టి' అని పిలుస్తాము. ఇవి డేంజర్ కానీ, మంచిగా క్లీన్ చేస్తే దీనికి మించిన ఔషధం ఎక్కడా దొరకదని నిపుణులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులు: ఎన్నో ఏళ్ల నుంచి కీళ్ల నొప్పులతో బాధ పడే వారికీ దీనిని తైలాలుగా చేసి దానిని నివారిస్తారు. అంతేకాదు, కండరాల నొప్పులకు కూడా దీనితో చేసిన మందులను ఉపయోగిస్తారు.

పక్షవాతంతో బాధ పడే వారికీ ఈ గింజలు ఓ వరం. అంతేకాదు, నరాల బలహీనత వంటి సమస్యలకు కూడా వీటి నుంచి మందులు తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే విపరీతమైన కడుపునొప్పికి కూడా చెక్ పెట్టగలవు.

అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. ఈ ముషిణి గింజలను డైరెక్ట్ గా అస్సలు తినకండి. చాలా డేంజర్. వీటిని పచ్చిగా అస్సలు తినకూడదు. ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని వాడాలి. అలా అని మోతాదుకి మించి వాడకూడదు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)