
కొన్ని పోషకాహారాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డాక్టర్లు కూడా వాటిని మన ఫుడ్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తారు. అలాగే మన అనారోగ్యానికి గురైనప్పుడు కూడా వాటిని ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది అని చెబుతుంటారు. వాటిలో ముఖ్యంగా అరటి పండ్లు, పాలు, యాపిల్స్, ఆరెంజ్, గ్రీన్ టీ వంటివి ఉంటాయి. అయితే ఇవి ఆరోగ్యానికి మంచి చేసేవే అయినా వాటిని సరైన టైమ్‌లో కాకుండా రాంగ్ టైమ్‌లో తీసుకుంటే లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది.

అరటి పండ్లను ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. చాలా మంది ఉదయం లేవగానే అరటి పండు తింటూ ఉంటారు. అలా తినడం వల్ల యాసిడిట్ సమస్య రావొచ్చు.

పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ పాలను రాత్రి పూట తీసుకోవడం మంచిది. చాలా మంది ఉదయం పూట పాలు తాగుతారు. ఉదయం కంటే రాత్రి పడుకునే ముందు పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

యాపిల్స్ ఉదయం పూట తింటే మంచిది. రాత్రి నిద్రపోయే ముందు యాపిల్స్ తినొద్దు. కానీ, చాలా మంది రాత్రి పూట సరదా కబుర్లు చెప్పుకునే సమయంలో యాపిల్స్ తింటూ ఉంటారు. పిల్లలకు కూడా రాత్రి పూట యాపిల్స్ ఇస్తారు. అలా కాకుండా ఉదయం పూట తినడం ఉత్తమం.

ఆరెంజెస్‌ను కూడా ఖాళీ కడుపుతో తినకపోవడం మంచిది. అలా తింటే యాసిడిటీ సమస్య రావొచ్చు. గ్రీన్ టీని కూడా ఖాళీ కడుపుతో తాగొద్దు. అలా తాగితే యాసిడిటీ సమస్య వస్తుంది.